Wednesday, May 1, 2024

నిన్ను నీవు తెలుసుకో…!

క ష్టనష్టాల సగటు జీవితాలను చదివిన నాకు, ఆకలితో ఉన్న పులి అడుగులను పసిగట్టే జింక హృదయ స్పందన నా కలానికి అబ్బింది. భౌతిక జ్ఞానపు నాస్తికుడిగా అలజడులతో ఉన్నప్పటికన్నా, ఆత్మజ్ఞానం కోసం తపించే ఆస్తికుడిగా ఉన్న అనుభూతి ఎడారిలో నీటి మడుగు చూసినట్లు మనసు ఆనందిస్తుంది.
రామాయణ భారత గాథలను ఆయా పాత్రలను హతువాద దృష్టితో అవి మిథ్య, అసత్యమని వాదనల కన్నా, ఆపాత్రలో మంచిని, వాటి మనో ఔచిత్యాలను మన జీవితాలకు ఆపాదించుకుంటూ… ఆచరిస్తే ఎంత బాగుంటుందో.. కోట్లకోట్ల దీపాలతో దేవుణ్ణి ఆరాధించ డం కాదు, నీలో ఒక్క ఆత్మజ్యోతి వెలిగించుకో, ఆ వెలు గులో నీకు పరమాత్మ, జీవిత పరమార్ధం రెండూ తెలు స్తాయి. గుడులు గోపురాలు నదీనదాలు చెట్లు చేమలు రాళ్ళు రప్పలు చుట్టూ తిరగడంకన్నా నీ చుట్టూ నీవు తిరి గితే, నిత్య సత్యాలు తెలుస్తాయి. నిన్ను నీవు తెలుసుకుంటే దేవుని తెలుసుకున్నట్లే. నిజానికి దేవుడు మనం కల్పించు కొన్న ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేసుకోవాలంటే, నేను అనే అహాన్ని తొలగించు, నేనెవరు నీవెవరు అని పరిశీలించు. అప్పుడే దేవుడే జీవుడు, జీవుడే దేవుడు అని తెలుసుకోగలవు. అప్పుడు నీ మనసుక ుఆనందమే కాదు, మహానందం, పరమానందాన్ని పొందుతుంది. ఎలాంటి అలజడులు నీ మనసులోకి రానేరావు, ప్రశాంత జీవితానికి ఆధ్యాత్మికత పునాది అవుతుంది.
మనము పురాణాలలోని పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తాము. కానీ వాటిలోని పరమార్ధాన్ని వదిలి వేస్తున్నా ము. ఉదాహరణకు ఏ ప్రాంతంలోనైనా ఆంజనేయుడు తపస్సు చేసుకున్నాడంటే, ఇక ఆ ప్రాంతానికి మహమ ఉందని, గుంపులు గుంపులుగా, ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగాను, మహమాన్విత ప్రాంతంగా చేసి, అక్కడ పూజా పునస్కారాలు చేస్తుంటారు. నిజానికి అక్కడ ఆ ప్రాంతంలోని రాతిబొమ్మలకు, స్థలాలకు విలువనిస్తు న్నాం, కానీ అసలు ఆ ప్రాంతంలో తపస్సు చేసిన ఆంజ నేయస్వామి లక్షణాలు, అతని కార్యదీక్ష, అతని స్వామి భక్తి అలాంటివి పరిశీలించం, ఆచరించడం అంటే పదా ర్థాలకు విలువ ఇస్తున్నాం. కానీ పరమార్ధాన్ని వదిలి వేస్తు న్నాం. జీవుడు వ్యష్టి, దేవుడు సమిష్టి, వ్యక్తి పవిత్రంగా ఉంటే, ఆనందంగా ఉంటే సమాజం కూడా పవిత్రంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. కనుక వ్యక్తి అహం, స్వార్థం వీడి తాను బ్రతుకుతూ, పదిమందిని బ్రతికిస్తూ ఉంటే, సమాజం కూడా ప్రగతి పథంలో వికసిస్తుంది. మనిషి జీవితం ప్రశాంతంగా మనుగడ సాగాలంటే రెం డు కారాలను తగ్గించుకోవాలి. అహంకారం, మమకా రం, ఈ రెండూ తగ్గినప్పుడు ఏ సమస్య అయినా పరిష్క రించబడుతుంది, ముందు నీవు మారు, నిన్ను నీవు సం స్కరించుకో, అప్పుడు ప్రపంచాన్ని గురించి ఆలోచిం చు. శాంతికి అశాంతికి, సుఖానికి దు:ఖానికి, స్వర్గానికి నర కానికి, మంచికి చెడుకి, ఆశకు నిరాశకి, ధైర్యానికి భయా నికి అన్నిటికీ మూలము మనసు కాబట్టి మనసును అదు పులో పెట్టుకోగలిగితే దానికి మించిన ధ్యానం, యోగం భక్తి, ముక్తి మరేదీ లేదు. కనుక మనసుని తృప్తి పరుచు కుంటే, జీవితమంతా సంతృప్తితో బ్రతకవచ్చు. అందుకే మన వేదాలలో కొన్నింటి ముఖ్యాంశాలు ప్రస్తావించారు.
‘జ్ఞానం బ్రహ్మ’ అంటే జ్ఞానమే బ్రహ్మ. నిన్ను నువ్వు తెలుసుకోవడమే ప్రపంచం, నిన్ను నువ్వు తెలుసుకోవ డమే దేవుడు. రెండవది ‘తత్వ మసి’ అంటే అది నీవే, నీ లోనే అన్నీ ఉన్నాయి. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడ మే వేదతత్వం. మరొక వాక్యం ‘అహం బ్రహ్మా స్మి’ అంటే నేనే బ్రహ్మని, నేనే అణువును,నేనే పరమాణువును, నేనే బ్రహ్మాండాన్ని. నేనే సూక్ష్మాన్ని, నేనే స్థూలాన్ని, అప్పుడు ఆత్మ జీవాత్మ ఒకటేనని తెలుస్తుంది. అలాగే ‘త్వమేవా హం’ అంటే నీవే నేను, నేనే నీవు, ఇది తెలుసుకున్న తర్వాత మరొక వాక్యం ‘అయమాత్మ బ్రహ్మ’ అంటే సకల జీవుల లో ఉన్న ఆత్మని నేనే… అన్ని జీవులలోనున్న పరమాత్మని నేనే అని అందుకు నేనే సాక్షి అని తెలుసుకోగలుగుతావు. వీటిని తెలుసుకున్నవాడే జ్ఞాని. మహాజ్ఞాని, ముని, మహా ముని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement