Sunday, May 5, 2024

మన జీవన యాత్ర-మన లక్ష్యం

మనలో చాలామందికి ఎలా జీవించాలో తెలియ దు. ఎందుకు జీవించాలో అంతకంటే తెలియ దు. కొంతమంది బ్రతుకు బండి భారంగా లాగిస్తుంటే, మరికొంతమంది తెగిన గాలిపటంలా గాలివాటంగా కొట్టుకుపోతున్నారు. తెల్లవారి లేచింది మొదలు ఒకటే హడావుడి, టెన్షన్‌, గందరగోళం. భార్యాపిల్లలు, వాళ్ల చదువులు, ఉద్యోగం, రిటైర్మెంట్‌, కొంత కాలానికి ఈ లోకం నుండి నిష్క్రమణ ఇంతేనా జీవితమంటే. జీవి తంలో అన్నీ ఉండి, ఎటువంటి బాధలు లేకుండా హాయిగా జీవిస్తున్నట్లు కనిపించేవారు కొంతమంది అయితే, రోజులు గడవక బాధపడేవారు మరికొంత మంది. ఉన్నవారికీ, లేనివారికీ గూడా ఏదో వెలితి, అసంతృప్తి, ఏదో కోల్పాయామనే లోలోపల వ్యధ. ఇదంతా జీవితం పట్ల సరైన అవగా#హన కొరవడినం దువల్ల జరుగుతున్న అనర్థం. జీవితంలో ఉన్నతమైన లక్ష్యం లేకుండా ఏదోవిధంగా బ్రతికేస్తే చాలు అనుకోవ డంవల్ల వచ్చిన సమస్య.
శ్రీమాత మాటలలో లక్ష్యం అంటే…
”ప్రతి ఒక్కరికి జీవితం లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకపోతే జీవితం సర్వవేళలా దుర్భరంగా ఉంటుంది. ప్రతి మనిషికీ ఒక లక్ష్యం వుండాలి. ఆ లక్ష్యం ఎంత విలు వైనది, ఉన్నతమైనదీ అయితే, జీవితం కూడా అంత ఉన్నతంగా, సారవంతంగా ఉంటుంది” అంటారు శ్రీమాత.
అయితే మనం అందరం అనుకునే సాధారణ లక్ష్యాల గురించి కాదు శ్రీమాత చెప్పింది. శ్రీమాతార విందులు చెప్పిన ప్రకారం మనలో ప్రతి ఒక్కరికీ జన్మత: చేయాల్సిన పని ఉంది. అధిష్టించాల్సిన స్థానం ఉంది. నిర్వహంచాల్సిన పాత్ర ఉంది. పైగా ఆ పనిని మరొకరు చేయలేరు. ఎవరి పని వారికే ప్రత్యేకం. అది మన అంతరంగానికే తెలుసు. అయితే దీనిని తెలుసు కోవడం, ఆచరించటం అనే దాని మీద జీవితానికి అర్థం, పరమార్థం ఆధారపడి ఉంది. అది తెలియాలం టే మన జీవితానికి ఒక ఉన్నతమైన లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఎంత ఉన్నతం, విశాలం, నిస్వార్థమైతే అప్పుడు ఆ జీవితం తనకు, ఇతరులకూ కూడా ప్రయోజనకరం గా ఉంటుంది. యోగ్యమై ఆనందదాయకంగా ఉం టుంది. అందులో లభించే తృప్తి అవ్యక్తంగా ఉంటుంది. క్రమంగా తానీలోకంలో చేయవలసిన పని, తన పాత్ర, తన స్థానం తెలుసుకోవడం జరుగుతుంది. ఆవిధంగా అంతర్జీవితంలో ఒక పూర్ణత్వాన్ని సాధిస్తాడు. అంతరం గ లోతులలో ప్రశాంతతను ఆనందాన్ని పొందటం జరుగుతుంది.
ఇదంతా సాధించాలంటే ఈ విషయాన్ని మరి కొంత లోతుగా పరిశీలించాలి. మన హృదయంలో రెం డు అరలు ఉన్నాయని అనుకుందాము. ఆ అరలలోని వెనుక అరలో చైత్య పురుషుడు ఉంటాడు. ముందు అరలో బాహ్య జీవితానికి సంబంధించిన ఆవేదనలు, ఆవేశాలు, స్పందనలు, అలవాట్లు, వాటి కేంద్రం ఉం టుంది. ఇవన్నీ బాహ్య జీవితంతో సంబంధం కలిగి ఉంటాయి. వెనుకవైపు వున్న చైత్య పురుషుడే మన జీ వితాన్ని నడిపించే పాత్ర, మన ఉనికి, మనం చేయా ల్సిన పని- జీవిత పరమార్థం తెలిపి నడిపించే జీవిత నేత. సర్వాంతర్యామి ప్రతినిధి. ఈ చైత్య పురుషుని స్వాధీనంలో ఉండగలగడమే మన ప్రధానమైన పని, సాధన. అప్పుడు మన జీవితాన్ని నడిపే బాధ్యత అతడే వహస్తాడు.
అందుకొరకు మనం చేయవలసింది ఈ చైత్య పురుషుని స్వభావాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం, అతనితో ఏకం కావడం. అందుకోసం మన ఆకాంక్ష, సంకల్పము క్రియాశీలమై ఉండాలి. ఆధ్యాత్మిక చింత నను పెంపొందించే ఉన్నతమైన గ్రంథాలను చదవడం, అంతరంగంలోని హృదయ కేంద్రంలో ఏకాగ్రతతో ధ్యానం, సత్సంగం, మనం చేసే ప్రతి పనిని, ప్రతి కదలి కను అంతరంగంలోని చైత్య పురుష సన్నిధికి సమర్పిం చుకోవడం. ఇలా నిరంతరం జరుగుతూ ఉండాలి. ఈ ఆకాంక్షా జ్వాల కొడికట్టకూడదు. తినే తిండి, నడిచే నడక, పోయే నిద్ర, చేసే పని (అన్ని పనులూ) చూసే చూ పు ఇలా ఒకటేమిటి సర్వం ఆ వెలుగులోనే నిర్వర్తించాలి. సర్వం దైవానికే సమర్పించాలి. అప్పుడు జీవితం ఉన్న తంగా, పరిపూర్ణంగా లక్ష్యం వైపుగా సాగిపోతుం ది.
మనం సిద్ధంగా ఉంటే అందుకు కావలసిన శక్తిని శ్రీ మాతారవిందులు మనకు ప్రసాదిస్తారు. అదే వారి అవతార లక్ష్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement