Saturday, May 4, 2024

విష్ణు ఆరాధనకు విశిష్టం మాఘ పూర్ణిమ

మనం నివసించే ప్రాంతాల్లో పుణ్యనదీ పరివాహక ప్రాంతం కానీ, సముద్రం కాని లేకపోయినా మనకు అందుబాటులో ఉన్న నూతి వద్ద కాని, తటాకంలో కాని స్నా నం చేసే సమయంలో ఈ క్రింది శ్లోకం చెప్పుకొని చేస్తే, పుణ్యనదులలో చేసిన పుణ్యం సిద్ధిస్తుంది.
”గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధం కురు!”
మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు —
” వైశాఖీ- కార్తీక మాఘే
తిథియో తీవ పూజితా
స్నాన- దాన- విహనాస్తా!
ననేయా: పాండు నందనా!!”
అంటే వైశాఖ- కార్తీక- మాఘ మాసాల్లో వచ్చే పూర్ణిమలలో పుణ్యనదీ స్నానం చేసి జప- అనుష్టాది కార్యాలు పూర్తి చేసి శక్తిమేరకు దానంచేసి, విష్ణువును ఆరాధించకుండా వృధాగా వెళ్ళదీయడం మహాపాపమని ఉపదేశించాడు.

స్నానం చేసే సమయంలో పాటించవలసినవి

వేకువజాముననే, అంటే ఉష:కాలంలోనే ఆచరిస్తూ-
”దు:ఖ దారిద్య్ర నాశాయ శ్రీ విష్ణో తోషణాయచ
ప్రాత: స్నానం కరోమ్య మాఘే పాప వినాశనం!” అని పఠిస్తూ చేయాలి. స్నానం చేసే సమయంలో సూర్యుడుకి అర్ఘ్యం ఇచ్చుకోవాలి. సముద్ర స్నానం గొప్పది అని అంటుంటా రు. ఎందుకంటే ప్రతీ పౌర్ణమి, అమావాస్య రోజున సముద్రం పొంగుతూ ఉంటుంది. దేవత లు స్నానమాచరించడానికి సాగర ప్రాంతానికి వస్తారని ప్రతీతి. అంతేకాకుండా వారి శక్తిని, తేజస్సును సముద్రం, పుణ్యనదీ జలాల్లో నిక్షిప్తం చేస్తారని పురాణ కథనం. మాఘమాసం శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం.
పౌర్ణమి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడంవల్ల, లక్ష్మీదేవి అనుగ్ర#హం కలుగుతుంది. స్నానానంతరం సూర్యునికి సంబంధిత స్తోత్రాలు, విష్ణు సహస్రనామ స్తోత్రం, పురాణం పారాయణ చేయడంవల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
”పౌర్ణమి నాడు వస్త్రదానం, గొడుగు, పాదరక్షలు, తిలలు వంటి వేదైనా దానం చేయ డం ద్వారా మన పాపాలకు విముక్తి లభిస్తుంది.” అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఒక సందర్భం లో తెలిపారు.

విష్ణు ఆరాధన మహాత్మ్యం

గౌతమ మ#హర్షి తన శిష్యులతో సహా తీర్థయాత్రలకు వెడుతూ అనేక పుణ్యక్షేత్రాలు సం

దర్శించి, మార్గమధ్యంలో కనపడిన మహర్షులతో, భక్తులతో, సన్యా సులతో భగవంతునిపై గోష్ఠి జరుపుతూ ఉండేవారు. మాఘమాసం పౌర్ణమి రోజు వస్తుందనగా మహర్షి తన శిష్యులతో ఒక అడవి గుండా ప్రయాణిస్తూ, పౌర్ణమి రోజున కృష్ణానది ఒడ్డున చేరి, అక్కడ పుణ్యస్నా నాలు ఆచరించారు. దగ్గరగా ఉన్న రావిచెట్టు క్రింద నేలను శుభ్రం చేసి, అందరూ కూర్చొని విష్ణువును ఆరాధించారు. తరువాత గౌతమ మహ ర్షి విష్ణు పురాణం చెబుతున్నారు. ఒక ఆడ కుక్క శ్రద్ధగా వింటోంది.
శిష్యులు కుక్కను తరిమేస్తుంటే, మళ్ళీ వచ్చేది. ఒక శిష్యుడు గట్టి గా బెదిరించేసరికి, కుక్క ఆ వటవృక్షం చుట్టూ మూడుసార్లు ప్రదక్షి ణలు చేసి, గురువు గౌతమ మహర్షి వద్ధకు రాగానే, ఒక మహా రాజు గా గోచరించాడు. అపుడు గౌతమ మహర్షి ”మీరు ఎవరు రాజా? ఈ కుక్క రూపంలో ఎందుకు తిరుగుతున్నా రు?” అని అడిగాడు.
ఆ రాజు ”అయ్యా! ఈరోజు మీ నోటినుండి వెలువడిన విష్ణు పురాణము వినడంవల్ల, మీరు పఠించిన విష్ణు సహస్రనామా లు, ఇతర స్తోత్రాలు వల్ల నా పూర్వపు రూపు వచ్చింది. నేను రాజు గా ఉండగా, ఒక యోగి వచ్చి ”తాను చేయబోయే యజ్ఞ యాగాలకు ధన సహాయం కోరగా, నేను ఆయన చేయ తలపెట్టిన యజ్ఞయాగాలు గురించి అడగ్గా, మాఘ మాసం సమీపిస్తోంది. విష్ణువు అనుగ్రహం గురించి కొన్ని యజ్ఞ యాగాలు చేస్తాను. అని చెప్పి, మాఘమా సం విశిష్టత గురించి చెప్పగా, నేను హళనగా దేవుడి కి ఈ యజ్ఞ యాగాలు అవసరమా? ఆయన రక్షిస్తా డా?” అంటూ పరిహాసం చేయగా, ఆ మహర్షి క్రోధం తో ”నన్ను ఒక ఆడ కుక్కవై అడవిలో సంచరిస్తుంటా వు.” అన్నాడు. అప్పుడు ఆయనకు కొంత ధనసహా యం చేసి, నాకు శాప విముక్తి కలిగించండి” అని కోరా ను. అపుడు ఆయన ”నువ్వు కుక్క రూపంలో ఉండగా మాఘమాసం విశిష్టతను, విష్ణు పురాణం విన్నప్పుడు తిరిగి రాజుగా అవుతావు.” అని శాప విము క్తి చెప్పారు. మీ అందరి దయవల్ల నాకు శాప విముక్తి కలిగింది.” అని వివరించాడు రాజు. గౌతమ మ#హర్షి రాజుకు #హత వచనాలు చెప్పి పంపారు. తరువాత మ#హర్షి శిష్యుల తో ముందుకు సాగారు.
అలాగే దిలీప్‌ మహారాజు వేటకు వెళ్ళి, ఒకచోట శూత మహాముని తన శిష్యులతో విష్ణువును ఆరాధిం చి, మాఘమాసంలో పుణ్యనదీ స్నానం ఫలితం- మా ఘమాసం విశిష్టత, మాఘమాస వ్రతం, పౌర్ణమి మహాత్యం చెప్తుండగా విని, తిరిగి తన రాజ్యానికి వెళ్ళి, ఆస్థానంలో ఉన్న వశిష్ఠ మ#హర్షిని మాఘమాసం గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకా దు విరివిగా దానధర్మాలు చేయడం, తన రాజ్యంలో విధిగా మాఘ మాసం పాటించేటట్లు హుకుం జారీ చేసాడు. విష్ణు భక్తుడు అయి పోయాడు. ఇంతటి మహమాన్వితమైన మాఘమాసంలో ప్రసిద్ధమైన రోజులు పా టిస్తూ, శివకేశవులిద్దరినీ ఆరాధిస్తూ మన జీవితాలను సుసంపన్నం చేసుకొందాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement