Monday, May 6, 2024

మాధవ మాసం… వైశాఖము

వసంత ఋతువులో వచ్చే చై త్రమాసాన్ని ‘మధుమా సం’ అని, రెండవ మాసం అయిన వైశాఖాన్ని ‘మాధవ మాసం’ అని వైదిక సాంప్రదాయంలో అంటా రు. వైశాఖమాసం లక్ష్మీనారాయణుల ఆరాధనకు అత్యంత విశిష్టమైనది. అ న్ని మాసాల్లోకి వైశాఖమాసం ఉత్తమ మైనదని, ఎంతో పుణ్యప్రదమైన మాస మని, ఈ నెలలో చేయవలసిన అనేక వ్రతాలు, పూజలు, దానాలు గురించి పురాణాలు చెబుతున్నాయి. నేటి నుం చి వైశాఖ మాసం ప్రారంభమవుతు న్నది. అత్యంత పవిత్రంగా చెప్పబడు తున్న ఈ మాసంలో ప్రతి దినము పు ణ్యదినమే. అటువంటి ముప్ఫై పుణ్య దినాలు కలిగిన ఈ మాసంలో ఆచరిం చాల్సిన విధులు పురాణాల్లో వివరించబడ్డాయి.
వైశాఖమాస మహత్మ్యాన్ని శ్రీమహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తికం, మాఘ మాసాలంతటి ప్రాశస్త్యంగల మాసం వైశాఖం అని వైశాఖ పురాణం చెబుతుంది. కార్తిక పురాణం, మాఘ పురాణం ఏవిధంగా వున్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసమహర్షి రచించారు. ఈనెలలో వచ్చే పౌర్ణమిరోజు విశాఖ నక్షత్రం వుండటం వలన ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది. ఆధ్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న మాసాల్లో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం వుంది. ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్నివిధాలా అనువైనది. కార్తిక, మాఘ మాసాలలో తెల్లవారుజాము న స్నానం చేసిన విధంగా ఈ నెలలో సూర్యుడు మేష సంక్రమణంలో ఉండగా ప్రాత:కాల స్నానం చేస్తే మంచిదని చెబుతారు. స్నాన, పూ, దానధర్మాలు వంటి వాటిని ఈ నెలలో ఆచరించడంవల్ల మాన వులకు ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం, సిద్ధిస్తాయని పురాణ కథనం.
వైశాఖమాసంలో నదీస్నానం ఉత్తమ మైనదని, అందుకు అవకాశం లేని స్థితిలో గంగ, గోదావరి వంటి పుణ్యనదులను స్మరిం చుకుంటూ కాలువల్లోగానీ, చెరువులోగాని, బావులవద్దకగాని అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలని, నీటియందు సకల దేవత లు కొలువుతీరి ఉంటాయని పురాణాలు చెబు తున్నాయి.
శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో పాడ్యమి నుంచి వైశాఖ బహుళ అమావాస్య వరకు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి తో కలిపి తులసిదళాలతో పూజించడం ముక్తి దాయకమని చెబుతారు.ఈ మాసంలో ఏక భుక్తం, నక్తం వుండటం ఉత్తమంగా చెప్పబడింది. యజ్ఞాలు, తపస్సులు, పూజాదికాలు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతిని చేకూరుస్తుందని చెబుతా రు. వైశాఖమాసం నెలరోజులు విష్ణుసహస్రనామ పారాయణ చేయడం ప్రశస్తమని, అశ్వత్థ వృక్షానికి పుష్కలంగా నీరు పోసి ప్రదక్షిణలు చేయా లని, అలా చేయడం వలన అభీష్ట సిద్ధి లభిస్తుందని, పితృదేవతలు తృప్తి చెందుతారని చెబుతారు. శివునికి ధారాపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటుచేయడం శుభ ఫలితాలనిస్తుందని పురాణ కథనం.
వైశాఖమాసంలో మామిడిపండ్లు, గొడుగులు, విసనకర్రలు, పాదరక్షలు నీటి పాత్రలు, బట్టలు ఎవరికైనా దానం చేస్తే విశేష ఫలితా లనిస్తుంది. దాహంతో వున్నవారికి మంచినీటిని ఇవ్వడం, చలివేంద్రా లను ఏర్పాటుచేయడం వల్ల దేవతానుగ్రహం కలుగతుందని చెబుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement