Saturday, June 15, 2024

శంఖచక్రగదాహస్తే… మహాలక్ష్మీ నవెూస్తుతే!

వసంత ఋతువు చైత్ర మాసంలో పౌర్ణమి రోజున దక్షిణకాశీగా ప్రసిద్ధిచెందిన కొల్హాపూర్‌లో శ్రీమహాలక్ష్మి అమ్మవారికి అత్యంత వైభవంగా రధోత్సవం నిర్వహిస్తారు. నేటి రాత్రి 7.30 నిమిషాలకు లక్ష్మీదేవి మూర్తిని ప్రత్యేక దీపాలు, పూలతో అలంకరించిన వెండి రథంలో ఊరేగిస్తారు. ఈ ఉత్సవ సందర్భంగా లక్ష్మీదేవి అవిముక్త క్షేత్రంగా భాసిల్లుతున్న కొల్హాపూర్‌ మహాలక్ష్మి ఆలయ ప్రాశస్త్య విశేషాల కథనమిది.హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని పూజించడం సర్వత్రా కనిపించే దయినా, అనునిత్యం పూజలందుకునే శ్రీ మహాలక్ష్మికి మన దేశం లో విడిగా వున్న ఆలయాలు తక్కువే. లక్ష్మీదేవికి ప్రత్యేకించి వున్న ఆలయాలలో కొల్హాపూర్‌ ఆలయం ముఖ్యమయినది. ఈ ఆలయం మహారాష్ట్ర లోని కొల్హాపూర్‌లో పంచగంగ నది ఒడ్డున బెంగళూరు- పూణ మధ్య జాతీయ రహదారిపై ఉంది. ఇది అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవది. స్కాంద పురా ణం, దేవీభాగవతాలలో ఈ క్షేత్రాన్ని కరవీర నగరమని, దేవిని కరవీర మహాలక్ష్మి అని ప్రస్తుతించారు. పరమశివుడికి కాశీ ఎలా అవిముక్త క్షేత్రమో, శ్రీ మహావిష్ణువు కి, లక్ష్మీదేవికి ఇది అవిముక్త క్షేత్రం. వారీ క్షేత్రాన్ని ఎప్పుడూ విడవకుండా వుంటా రు. అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ఏటా కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శిం చుకునేవాడు. వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలోఉన్న కాశీనగరాన్ని దర్శిం చుకోవడం కష్టమనిపించి, శివుడి గురించి తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో కాశీలో ఉన్న విశ్వనా థుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే, అక్కడే శివుణ్ణి దర్శిస్తానని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యంగల నగరం కొల్హాపురమని, అక్కడ శ్రీ మహాలక్ష్మి కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తన ను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట. శివుని ఆనతి మేరకు అగస్త్యుడు కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వర స్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా స్పష్టం అవు తున్నది.
ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించిన ట్లు, మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించింది. అందుకే ఆమె కరవీ ర మహాలక్ష్మి అయింది అంటారు. భృగు మహర్షి చేసిన అవమానాన్ని తట్టుకోలేని మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్‌లో వెలి శారని ఒక కథ. గర్భగుడి గోడపై శ్రీచక్రం వుండటం ఇక్కడ ప్రత్యేకం. శంకరాచా ర్యులవారు ఈ ఆలయాన్ని దర్శించి శ్రీ చక్రాన్ని స్ధాపించారు. తర్వాత విద్యాశంక ర భారతి ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని గుర్తించి ఒక మఠం నిర్మించారు. దత్తాత్రేయుడు ప్రతి రోజూ మధ్యాహ్నం ఇక్కడ భిక్ష చేస్తారని ప్రతీతి. దానికి చిహ్నంగా ఆయనకి ఉపాలయం వుంది. ఈ ఆలయం సుమారు 6 వేల సంవత్సరాల పురాతనమైనది గా భావిస్తారు. ఆ తర్వాత అనేక రాజుల సమయాలలో అభివృద్ధి చెందిన ఈ మందిరం విశాల ప్రాంగణంలో హమాడ్‌పంత్‌ శైలిలో, శిల్పకళా నైపుణ్యంతో నిర్మింపబడింది. 7వ శతాబ్దంలోని ఈ దేవాలయాన్ని చాళుక్యవంశ రాజైన కర న్దేవ్‌ తిరిగి చాలాకాలం తరువాత దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పవిత్ర స్థల నిర్మా ణ శైలిహమాడ్‌ పంత్‌ ప్రేరణతో చేయబడింది. ఈ ఆలయాన్ని యాదవ వంశీ యులు 8వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని చెపుతారు. ఈ నగరా న్ని కోల్‌పూర్‌ అని కోల్‌గిరి అని, కొలదిగిరి పట్టణ్‌ అని పిలిచేవారు. ‘కొల్లా’ అంటే ‘లోయ’ అని, ‘పూర్‌’ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రం విలసిల్లిందని చెబుతా రు. దీన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వీకులు పాలించ గా, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్థమాన మైంది.
నాలుగు దిక్కులా ముఖద్వారాలు కలిగి ఆలయం 5 గోపురాల కింద వుం టుంది. మధ్యలో ఒక గోపురం, నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు. తూర్పు గోపురం కింద మహాలక్ష్మి, మధ్య కుమార మండపం, పడమర గణపతి, ఉత్తర దక్షిణ గోపురాల కింద మహాకాళి, మహా సరస్వతి కొలువుతీరి వున్నారు. ఉపాల యాలలో వెంకటేశ్వరస్వామి, నవగ్రహాలు, రాధాకృష్ణ, కాలభైరవ, వినాయ కుడు, సింహవాహని, తుల్జాభవాని వగైరా అనేక దేవీ దేవతలున్నారు.
గర్భగుడిలో అమ్మవారి విగ్రహం సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠంపై మహాలక్ష్మి వజ్రశిల శిల్పం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. చతుర్భుజి. నాలుగుచేతులలో పండు, గద, డాలు, పాన పాత్ర ధరించి వుంటుంది మూడడుగుల ఎత్తున్న మూర్తి, అనేక ఆభరణాలతో సుసజ్జిత. చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక సింహ వాహన ము కనబడుతుంది. మూలవిరాట్‌ పడమటి ముఖంగా వుంటుంది. సూర్యకిర ణాలు ప్రతిరోజూ దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. అలాగే సంవత్సరానికి రెండు సార్లు మార్చి 21న, సెప్టెంబరు 21న సూర్యాస్తమయం అయినపుడు సూర్యుని పడమటి దిక్కులో గల చిన్న కిటికీగుండా అమ్మవారి ముఖాన్ని తాకుతాయి. ఆ సమయంలో అమ్మ వారి ప్రత్యేక దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.
మొదట ఒక్క మహాలక్ష్మినే ప్రతిష్టించారు. తర్వాత 11వ శతాబ్దంలో గండ రాదిత్య హయాంలో మరమ్మత్తులు, ప్రదక్షిణబాట, మహాకాళీ, మహాసరస్వతి ప్రతిష్ట జరిగాయి. మూలవిరాట్‌కి మహాకాళికి మధ్య మహాలక్ష్మి యంత్రం స్ధాపించబడింది. దీనిపైన గాజుపలక వుండటంతో భక్తులు దర్శించుకోవటానికి వీలుగా వుంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్‌ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని ‘అంబాబాయి’ అని పిలుస్తారు.
అమ్మవారికి రోజూ అయిదుసార్లు అర్చన జరుగుతుంది. ఉదయం అయి దు గంటలకు శ్రీ మహాలక్ష్మీ దేవికి సుప్రభాత సేవ చేస్తారు. కాకడ హారతి ఇస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు షోడశోపచార పూజ నిర్వహస్తారు. మధ్య, సాయంత్రాలలో పూజ, శేజ్‌ హారతి జరుపుతారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహస్తారు. చైత్ర పౌర్ణమితో పాటు నవరాత్రులపుడు అమ్మ వారికి వేడుకలు జరుపుతారు. దేవీనవరాత్రులలో తిరుమల నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు వస్తా యి. ప్రతి శుక్రవారం సాయంత్ర సమయంలో, పౌర్ణమి రోజు అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement