Friday, April 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అథ దశమోధ్యాయ:
విభూతియోగ:

అధ్యాయం 10, శ్లోకం 1

శ్రీ భగవాన్‌ ఉవాచ
భూయ ఏవ మహాబాహో
శృణు మే పరమం వచ: |
యత్తేహం ప్రీయమాణాయ
వక్ష్యామి హితకామ్యయా ||

1. తాత్పర్యము : శ్రీకృష్ణ భగవానుడు పలికెను : మహాబాహువులు గల ఓ అర్జునా! మరల ఆలకింపుము. నీవు నాకు ప్రియమిత్రుడవు అగుటచే ఇంతవరకు వివరించిన జ్ఞానము కన్నను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై నేను వచించెదను.

భాష్యము : భగవంతునికి ఆరు అపరిమిత ఐశ్వర్యాలుంటాయిని పరాశర ముని నిర్వచించెను. అవి శక్తి, కీర్తి, ధనము, జ్ఞానము, అదము మరియు వైరాగ్యము. శ్రీ కృష్ణుడు భూమి మీద అవతరి ంచినపుడు, వీటన్నింటినీ ప్రదర్శించినాడు. కాబట్టి వ్యాసదేవుని తండ్రి అయిన పరాశర ముని, శ్రీకృష్ణున్ని భగవంతుడుగా అంగీకరించినారు. ఈ విధముగా భగవంతుని ఐశ్వర్యాలను ఎంత వింటే అంతగా భక్తిలో స్థిరత్వమును సాధించవచ్చును. అర్జునుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియుడు కాబట్టి అతని శ్రేయస్సు కోరి ఈ అధ్యాయములో తన ప్రత్యేక ఐశ్వర్యాలను వివరించనున్నాడు. అటువంటి ప్రేమైక సంబంధాలు భక్తుల మధ్య ఎక్కడ ఉంటాయో అక్కడ ఇటువంటి భగవత్‌ చర్చ కొనసాగుతూ ఉంటుంది.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో

Advertisement

తాజా వార్తలు

Advertisement