Sunday, May 19, 2024

గీతాసారం(ఆడియోతో…)


అధ్యాయం 9, శ్లోకం 21

21.
తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణ పుణ్య మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా
గతాగతం కామకామా లభంతే ||

తాత్పర్యము : విస్తృతమైన స్వర్గలోకభోగముల ననుభవించి పుణ్యము క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగివత్తురు. ఈ విధముగా త్రివేదముల నియమానుసరణము ద్వారా ఇంద్రియభోగమును వాంచించువారు కేవలము జననమరణములనే మరల, మరల పొందుదురు.

భాష్యము : వాస్తవానికి స్వర్గాది లోకాలలో జీవిత కాలము ఎక్కువగానుండి ఇంద్రియ తృప్తికి అనేక భోగభాగ్యాలు అందుబాటులో నుండును. అయితే పుణ్యము తరగగానే మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకు తిరిగా రావలసి ఉంటుంది. కాబ ట్టి శ్రీ కృష్ణున్ని చేరుటయే జీవిత లక్ష్మమని తెలియని వ్యక్తి భౌతిక ప్రపంచములో పైకీ క్రిందకూ భ్రమిస్తూ భౌతిక జీవితాన్ని, సుఖ దు:ఖాలనూ, కొనసాగిస్తూ ఉంటాడు. అతడు బయట పడేందుకు వేరే మార్గమే ఉండదు. కాబట్టి మనము తెలుసుకొన వలసిన దేమిటంటే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి ఆధ్యాత్మిక జగత్తును చేరుకోవాలి. ఒకసారి అక్కడకు వెళ్ళిన తరువాత ఇక తిరిగి రావలసిన అవసరం ఉండదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement