Sunday, April 28, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 9, శ్లోకం 4

4.
మయా తతమిదం సర్వం
జగదవ్యక్తమూర్తినా |
మత్‌స్థాని సర్వభూతాని
న చాహం తేష్వవ స్థిత: ||

తాత్పర్యము : సమస్త జగత్తు అవ్యక్తరూపమున నాచే ఆవరించబడియున్నది. జీవులన్నియు నా యందున్నవి, కాని నేను వాని యందు లేను.

భాష్యము : మన ఈ భౌతిక ఇంద్రియములతో దేవాది దేవుడైన శ్రీకృష్ణున్ని గ్ర హించలేవము. శ్రీకృష్ణుని నామ, రూప, గుణ, లీలలను భౌతిక ఇంద్రియములతో అర్థము చేసుకొనలేము. సరైన మార్గ నిర్దేశకత్వములో శుద్ధ భక్తిని పాటించినట్లయితే ఇది సాధ్యము కాగలదు. అట్లని మనము తొందర పడి, భగవంతుడు సర్వత్రా వి స్తరించియున్నాడు కాబట్టి అతడు వ్యక్తిత్వాన్ని కోల్పోయాడనే దురవగాహనకు రాకూడదు. మన ముందు వ్యక్తమవుతున్న ఈ భౌతిక జగత్తే కాక ఆధ్యాత్మిక జగత్తు సైతమూ భగవంతుని శక్తిపైనే ఆధారపడి ఉంటుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement