Friday, May 17, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 27

27.
నైతే సృతీ పార్థ జానన్‌
యోగీ ముహ్యతి కశ్చన |
తస్మాత్‌ సర్వేషు కాలేషు
యోగయుక్తో భవార్జున ||

తాత్పర్యము : ఓ అర్జునా! భక్తులు ఈ రెండు మార్గములను ఎరిగినప్పటికిని ఎన్నడును మోహమునొందరు. కనుక నీవు భ క్తియందు సదా స్థిరుడవగుము.

భాష్యము : ఈ శ్లోకము నందు శ్రీకృష్ణుడు అర్జునునికి, జీవుడు మృత్యుసమయములో వేరు వేరు గమ్యాల ద్వారా కొనిపోబడతాడని విని కలత చెందవద్దని అభయాన్నిస్తున్నాడు. భక్తుడు ఏర్పాటు ద్వారా లేదా అకస్మాత్తుగా మరణించినా భయపడవలసినదంటూ ఏమీ లేదు. భక్తుడు కృష్ణచైతన్యములో స్థిరముగా, ‘హరే కృష్ణ’ మంత్రాన్ని జపించటయే అతడి కర్తవ్యము. ‘యోగయుక్త’ అనే పదము ఇక్కడ ముఖ్యమైనది. భగవంతుని సేవలో నియుక్తుడగుటచే అన్ని కార్యాలలోను కృష్ణున్ని స్మరిస్తూ యోగములో స్థిరముగా ఉండవచ్చును. దీనినే ‘యుక్త వైరాగ్యమ’ ని శ్రీల రూపగోస్వామి చెప్పియుండిరి. ఈ వి
28.ధముగా భగవత్సేవలో నియుక్తుడైన వ్యక్తి నిస్సందేహముగా భగవద్దామము చేరగలడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement