Friday, May 10, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 15, శ్లోకం 2
2.
అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా
గుణప్రవృద్ధా విషయప్రవాలా: |
అధశ్చమూలాన్యనుసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే ||

తాత్పర్యము : ఈ వృక్షశాఖలు ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్థ్వ, అధో ముఖములుగా వ్యాపిం చియున్నవి. దీని చిగుళ్ళే ఇంద్రియార్థములు. అధోముఖముగను ఉన్న ఈ వృక్షపు వ్రేళ్ళు మనుష్యలోకపు కామ్యకర్మలకు సంబంధించినవై యున్నవి.

భాష్యము : ఈ శ్లోకములో కూడా అశ్వథ్థ వృక్షము యొక్క వివరణ కొనసాగుచున్నది. దాని కొమ్మలు అన్ని దిశలా విస్తరించి ఉన్నవి. దాని క్రింది భాగమున రకరకాల మనుషులు, జంతువులు కలరు. దాని ఉన్నత భాగమున ఉన్నత జీవరాశులైన దేవతలు, గంధర్వులు మున్నగు వారు కలరు. ఈ చెట్టు త్రిగుణములనే నీరుచే పోషింపబడుచున్నది. ఇంద్రియభోగ వస్తువులే దాని చిగురాకులు. వేర్వేరు గుణములు వృద్ధి చెందినపుడు ఇంద్రియములు ఇంద్రియ భోగవస్తువులను అనుభవించును. కళ్ళు, ముక్కు, చెవులు వంటివి ఇంద్రియములైతే రూపము, వాసన, శబ్ధములు వాటి భోగ వస్తువులు. వీటి సంపర్కరము వలన కొన్ని సార్లు ఆనందు మరికొన్ని సార్లు దు:ఖము లభించును. ఇవే ఆ చెట్లు వేరులకు ఆధారభూతములు. సుఖ దు:ఖముల వలన అయిష్టాలను పెంపొందిచుకుంటాము. ఆ విధముగా పాపాము, పుణ్యములలో నిమగ్నమయి ఆ వృక్షపు వేర్లకు ఉపశకలను పెంచుతాము. ఇవి అన్ని దిశలకూ విస్తరిస్తాయి. అలా ఉన్నత లోకాలకు వెళ్ళి పుణ్యము తరగిన తరువాత భూమిపైకి తిరిగి వచ్చి మరలా పై లోకాలకు వెళ్ళుటకు పుణ్యము మొదలు పెట్టును. అలా మానవులుండు ఈ భూలోకము కర్మభూమి అనబడును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement