Wednesday, May 1, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 5
5.
సత్త్వం రజస్తమ ఇతి
గుణా: ప్రకృతిసంభవా: |
నిబధ్నంతి మహాబాహో
దేహే దేహినమవ్యయమ్‌ ||

తాత్పర్యము : ఓ మహాబాహుడైన అర్జునా! భౌతిక ప్రకృతి సత్వరజస్తమోగుణములనెడి మూడు గుణములను కలిగి యుండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును.

భాష్యము : ఒక రకముగా చెప్పలెనన్న జీవుడు దివ్యత్వమును కలిగి ఉన్నందున ఈ భౌతిక ప్రకృతితో అతనికి సంబంధమే
లేదు. కానీ భౌతిక ప్రకృతిలో బంధీ అయిన కారణమున త్రిగుణముల ప్రభావమునకు లోనవుతాడు. వేరు వేరు గుణములను బట్టి వేరు వేరు శరీరములు ఇవ్వబడుట వలన వాటికి తగ్గట్టుగా జీవుడు ప్రవర్తించవలసి వస్తుంది. అందువలన వారు నానారకాల సుఖదు:ఖములను అనుభవించుచూ ఉందురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..
—–

Advertisement

తాజా వార్తలు

Advertisement