Friday, May 3, 2024

గీతాసారం(ఆడియోతో..)

అధ్యాయం 7, శ్లోకం 10

బీజం మాం సర్వభూతానం
విద్ధి పార్థ సనాతనమ్‌ |
బుద్ధిర్బుద్ధిమతామస్మి
తేజస్తేజస్వినామహమ్‌ ||

తాత్పర్యము : ఓ పృథకుమారా ! నేనే సర్వప్రాణులకు సనాతన బీజమనియు, బుద్ధిమంతుల బుద్ధిననియు, శక్తిమంతుల శక్తివనియు తెలిసికొనుము.

భాష్యము : చరాచర జీవరాశులకు బీజము శ్రీకృష్ణుడే. 84 లక్షల జీవరాసులలో కొన్ని స్థావరమైతే, మరికొన్ని కదిలేవి. వాటన్నింటికీ జీవము నిచ్చేది శ్రీకృష్ణుడు. వేదాలలో చెప్పినట్లు బ్రహ్మము లేదా పరమ సత్యము సర్వానికి మూలము. అయితే శ్రీకృష్ణుడు పరబ్రహ్మము. బ్రహ్మము నిరాకారమైతే, పరబ్రహ్మము సాకారము. భగవద్గీత ప్రకారము బ్రహ్మమునకు శ్రీకృష్ణుడే ఆధారభూతుడు. కావున శ్రీకృష్ణుడే సర్వమునకు మూలము. అన్నింటికీ బీజము, భౌతిక సృష్టికి ఆధారము. అలాగే బుద్ధికి కూడా ఆయనే మూలము. కాబట్టి బుద్ధి లోపించిన వ్యక్తి ఆ శ్రీకృష్ణున్ని అర్థము చేసుకొనలేడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement