Friday, April 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 35
35.
సంజయ ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య
కృతాంజలిర్వేపమాన: కిరీటి |
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీత: ప్రణమ్య ||

తాత్పర్యము : దృతరాష్ట్రునితో సంజయుడు పలికెను : ఓ రాజా! దేవదేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకుళిత హస్తుడై మరల మరల వందనములనొసగెను. భీతిని కూడినవాడై అతదు డగ్గుత్తిక తో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను.

భాష్యము : ఇంతకుముందే వివరించినట్లు, భగవంతుని విశ్వరూప దర్శనమునకు అర్జునడు ఆశ్చర్యచకితుడయ్యెను. దాని వలన కృష్ణునికి పదే పదే ప్రణామాలను అర్పించ నారంభించెను. గద్గద స్వరముతో ప్రార్థనలను చేసెను. ఒక స్నేహితునిగా కాక అద్భుత రసభావన కలిగిన భక్తునిగా కృష్ణున్ని ప్రార్థించెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement