Tuesday, April 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 19
19.
అనాదిమధ్యాంతమనంతవీర ్యమ్‌
అనంతబాహుం శశిసూర్యనేత్రమ్‌ |
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపంతమ్‌ ||

తాత్పర్యము : నీవు ఆదిమధ్యాంత రహితుడవై యున్నావు. నీ వైభవము అపరిమితమై యున్నది. అసంఖ్యాకములుగా భుజములను కలిగిన నీవు సూర్యచంద్రులను నేత్రములుగా కలిగియున్నావు. ముఖము నుండి తేజోమయమైన అగ్ని బయల్వెడలుచుండ స్వతేజముతో ఈ సమస్త వి శ్వమును తపింపజేయుచున్నట్లుగా మాత్రమే నిన్ను గాంచుచున్నాను.

భాష్యము : భగవంతుని షడైశ్వర్యాలకు అంతులేదు. ఇక్కడ, మరికొన్ని చోట్ల పదే పదే చెప్పిన వాటినే తిరిగి చెప్పటం జరిగినది. అయితే శాస్త్రాల ప్రకారము కృష్ణుని గొప్పతనాన్ని మరల మరల చెప్పుట తప్పుకాదు. అటువంటి వ్యక్తీకరణలో దోషము లేదు. భ్రాంతి చెందినపుడు. అద్భుత అనుభూతిని పొందినపుడు మరియు తన్మయత ్వముతో మరల మరల చెప్పుట తప్పు కాదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement