Saturday, April 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 12
12.
దివి సూర్యసహస్రస్య
భవేద్యుగపదుత్థితా |
యది భా: సదృశీ సా స్యాత్‌
భాసస్తస్య మహాత్మన: ||

తాత్పర్యము : లక్షలాది సూర్యులు ఒక్కమారు ఆకాశమున ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపమునందలి పరమ పురుషుని తేజస్సును పోలగలదు.

భాష్యము : అర్జునుడు చూస్తున్న దానిని వివరించుట సాధ్యము కాదు. అయితే సంజయుడు దృతరాష్ట్రునికి ఒక అవగాహనను కలిగించుటకు ఉపమానములను ఇచ్చుచున్నాడు. దృతరాష్ట్రుడు, సంజయుడూ ఇద్దరూ కురుక్షేత్ర రణరంగము నందు లేరు. అయితే వ్యాసదేవుని కృపవలన జరుగుచున్నదానిని చూడగలుగుచున్నారు. ఆ విధముగా సంజయుడు తనకు అర్థమవుచున్న దానిని అనగా విశ్వరూప కాంతిని వేలకొలది సూర్యుల కాంతి వలే ఉన్నదని పోల్చి చెప్పుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement