Monday, May 6, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 25
25.
మహర్షీణాం భృగురహం
గిరామస్మ్యేకమక్షరమ్‌ |
యజ్ఞానాం జపయజ్ఞోస్మి
స్థావరాణాం హిమాలయ: ||

తాత్పర్యము : నేను మహర్షులలో భృగువును, ధ్వనులలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో జప యజ్ఞమును, స్థావరములైన వానిలో హిమాలయమును అయి యున్నాను.

భాష్యము : బ్రహ్మ పుత్రులలో అత్యంత తేజోవంతుడైన ఋషి, భృగు మహర్షి. దివ్య ధ్వనులలో ‘ఓం’ కారము శ్రీకృష్ణున్ని సూచిస్తుంది. యజ్ఞాలలో ”హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే” కృష్ణుని విశుద్ధ రూపము. మిగిలిన యజ్ఞాలలో జంతు బలి ఉంటుంది. అయితే ఈ యజ్ఞము చాలా సులభమైనది, అత్యంత పవిత్రమైనది. హిమాలయాలు గొప్ప పర్వతము కాబట్టి కృష్ణున్ని సూచిస్తుంది. అప్పుడప్పుడు మేరు పర్వతము కదల్చబడుతుంది కాబట్టి కదలని హిమాలయం పర్వతమే మేరు పర్వతము కంటే గొప్పది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement