Friday, April 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 20
20.
అహమాత్మా గుడాకేశ
సర్వభూతాశయస్థిత: |
అహమాదిశ్చ మధ్యం చ
భూతానామంత ఏవ చ ||

తాత్పర్యము : ఓ అర్జునా ! నేను సర్వజీవ హృదయములందు వసించి యున్నట్టి పరమాత్మను, సర్వజీవులకు ఆది మధ్య అంతములు నేనే అయి యున్నాను.

భాష్యము : కృష్ణుడు ఇక్కడ అర్జునున్ని ‘గుడాకేశ’, అనగా నిద్రను లేదా అజ్ఞానాన్ని జయించిన వాడని సంభోధించినాడు. అజ్ఞానములో ఉండి మనము భగవంతుడు ఎ లా సర్వత్రా విస్తరించి ఉన్నాడో అర్థము చేసికొనలేము. అర్జునుడు అజ్ఞానాన్ని జయించిన వాడు కాబట్టి అతనికి కృష్ణుడు తన విభూతులను వెల్లడి చేస్తూ ఉన్నాడు. సృష్టికి ముందు భగవంతుడు మహా విష్ణువు లేదా కారణోదకశాయి విష్ణువుగా విస్తరించెను. తరువాత ప్రతి విశ్వములోనూ గర్భోదకశాయిగా ప్రవేశించెను. అటు పిమ్మట ప్రతి అణువునూ క్షీరోదకశాయిగా విస్తరించెను. ఏ విధముగా నైతే ఆత్మ లేనిదే శరీరము ఎదగదో, అలాగే భగవంతుడు ప్రవేశిం చనిదే ఈ భౌతిక జగత్తులో మార్పులు సంభవించవు. ఆ విధముగా కృష్ణుడే ఈ సృష్టికి ఆది, మధ్యమము, మరియు అంతిమము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో

Advertisement

తాజా వార్తలు

Advertisement