Friday, May 17, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 9

09
అన్యే చ బహవ: శూరా:
మదర్థే త్యక్తజీవితా: |
నానాశస్త్ర ప్రహరణా:
సర్వే యుద్ధవిశారదా: ||

తాత్పర్యము : నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరును పలు విధములైన ఆయుధములను దాల్చినవారును మరియు యుద్ధ నిపుణతను కలిగినవారును అయియున్నారు.

భాష్యము : ఇక మిగిలిన వారి గురించి చెప్పవలెనంటే జయధ్రథుడు, కృతవర్మ మరియు శల్యుడు, దుర్యోధనుడి కోసము ప్రాణాలనర్పించుటకు సైతమూ సిద్ధపడి ఉన్నారు. మరో రకముగా చెప్పవలెనన్న పాపాత్ముడైన దుర్యోధనుని పక్షాన చేరినందుకు వారందరూ కురుక్షేత్ర యుద్ధము నందు సంహరించబడుదురని నిర్థారింపబడినది. అయితే దుర్యోధనుడు తన స్నేహితుల బలమును లెక్కించుకుని గెలుపు తనదేనని ధీమాతో ఉండెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో

Advertisement

తాజా వార్తలు

Advertisement