Friday, February 16, 2024

Tirumala శ్రీవారి సేవలో చంద్ర బాబు దంపతులు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట భార్య నారా భువనేశ్వరి ఉన్నారు. చంద్రబాబు దంపతులకు రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అంతకుముందు టీటీడీ అధికారులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. దర్శనానికి ఏర్పాట్లు చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారే కాపాడారని చంద్రబాబు అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తాను. ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని శ్రీవారిని వేడుకున్నాను. కష్టం వచ్చినప్పుడు స్వామివారిని మొక్కుకున్నాను. ధర్మాన్ని కాపాడాలని ప్రార్థించాను. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి. తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా ఉండాలి’’ అని కోరుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.  మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, పెద్ద సంఖ్యలో స్థానిక నేతలు చంద్రబాబు వెంట ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement