Sunday, April 28, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 52
52
యదా తే మోహకలిలం
బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం
శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||

తాత్పర్యము : ఎప్పుడు నీ బుద్ధి దట్టమైన మోహారణ్యమును దాటునో అప్పుడు నీవు వినినదాని యెడ మరియు వినవలసిన దాని యెడ విరక్తిని కలిగిన వాడవగుదువు.

భాష్యము : చరిత్రలో ఎంతోమంది గొప్ప భక్తులు భగవత్సేవలో నిమగ్నులగుట వలన వేదాలలో తెలుపబడిన తంతులూ, యజ్ఞాలను స్వస్తి చెప్పారు. ఉదాహరణకు మాధవేంద్రపురి, గొప్ప వైష్ణవ ఆచార్యులు కూడా సంధ్యావందనములకు, సంధ్యాస్నానములకు, పిండప్రదానములు మొదలగు వాటికి స్వస్తి చెప్పారు. భగవద్భక్తిలో మొదటి స్థాయిలో ఉన్నవారు వీటన్నింటిని పాటించవలెను గాని ఎవరైతే భక్తిలో స్థిరులై ఉంటారో వారికి ఎటువంటి నియమ నిబంధనలూ ఉండవు. కాబట్టి జీవిత లక్ష్యము భగవద్భక్తి అని పూర్తిగా విశ్వసించినవారు మిగిలిన వాటిని చేయవలసిన అవసరము లేదు. అయితే కేవలము యజ్ఞయాగాదులే అంతిమమని భగవద్భక్తిని స్వీకరించినవారు వేదాల గమ్యాన్ని కోల్పోయి సమయాన్ని వృథా చేస్తున్నట్లే లెక్క. కాబట్టి కృష్ణ చైతన్యములో మగ్నులై ఉన్నవారు శబ్దబ్ర హ్మమైన వేదాలను, ఉపనిషత్తులను అధిగమించినవారు అవుతారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement