Sunday, May 5, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 14
14
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ
శీతోష్ణసుఖదు:ఖదా: |
ఆగమాపాయినో నిత్యా :
తాంస్తితిక్షస్వ భారత ||

తాత్పర్యము : ఓ కౌంతేయా ! తాత్కాలికములైనట్టి సుఖదు:ఖముల రాకయు, కాలక్రమమున వాటి పోకయు శీత, గ్రీష్‌మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరత వంశీయుడా ! ఇంద్రియానుభవము వలన కలుగు అటువంటి ద్వంద్వములకు కలతనొందక సహించుటను మనుజుడు నేర్వవలెను.

భాష్యము : ధర్మ నిర్వహణలో తాత్కాలికమైన సుఖ దు:ఖాలను ఓర్చుకోవాలే గాని ధర్మాలను వదిలిపెట్టకూడదు. చలికాలములో కూడా ఉదయాన్నే లేచి స్నానము చేయవలసి ఉంటుంది. అలాగే వేసవిలో కూడా స్త్రీలు వంట చేయవలసి ఉంటుంది. అటువంటి కష్టాలను ఓర్చుకుని తమ ధర్మాలను నిర్వహించవలసి ఉంటుంది. అలాగే క్షత్రియునకు బంధువులతో యుద్ధము చేయవలసి వచ్చినా ధర్మాన్ని విడనాడరాదు. ఎందువలనంటే అటువంటి ధర్మ నిర్వహణ వలన జ్ఞానమును పొంది ముక్తి మార్గమున పయనించవచ్చును. ఇక్కడ ప్రత్యేకముగా అర్జునుడు, కుంతీ పుత్రుడుగా, భరత వంశీయుడుగా ఎంతో బాధ్యతను కలిగి యుద్ధము చేయవలసి ఉన్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement