Sunday, April 28, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 33
33
సదృశం చేష్టతే స్వస్యా:
ప్రకృతే: జ్ఞానవానపి |
ప్రకృతిం యాంతి భూతాని
నిగ్రహ: కిం కరిష్యతి ||

అర్థము : జ్ఞానవంతుడు సైతము తన స్వభావమును అనుసరించే కర్మను చేయును. ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి వారు పొందిన స్వభావము ప్రకారమే కర్మలను చేయుదురు. అట్లయిన కేవలము నిగ్రహము ద్వారా ఏమి సాధింపగలము?

భాష్యము : కృష్ణ చైతన్య దివ్య స్థితిలో నిలువకుండా ఎవరునూ త్రిగుణాలకు అతీతులు కాలేరు. కేవలము భౌతిక విద్యార్హతలతో, శుష్క జ్ఞానముతో ఎవరూ మాయను అధిగమించలేరు. కొంతమంది బహిరంగంగా సాధువులుగా చలామణీ అయినా అంతరంగంగా వారు త్రిగుణాలకు బంధీలే. నిజానికి త్రిగుణాలతో మనుకున్న బంధము అతి పురాతనమైనది. కాబట్టి మన స్వభావ ధర్మాలను చేసుకొంటూ కృష్ణ చైతన్య శిక్షణను పాటించినట్లయితే కృష్ణుని మాయ నుండి బయటపడే అవకాశము ఉన్నది. అట్లు కాక, కృష్ణ చైతన్యాన్ని పొందకుండా హఠాత్తుగా తమ స్వభావరీత్యా కర్మలను విడనాడి గొప్ప యోగులమని ప్రకటించరాదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement