Sunday, April 28, 2024

పరబ్రహ్మ స్వరూపం ఆహారం!

ఒక రాజుగారు వేటకు వెళ్లారు. మృగయా వినో దంలో దారి తప్పాడు. పైన ఎండ, లోపల క్షుద్బాధతో నీరసించిపోయాడు. తలెత్తి చూస్తే దూరం గా ఒక కుటీరం కనిపించింది. నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు. ఒక మహళ కొంతమందికి అన్నప్రసా ద వితరణ చేస్తోంది. రాజును చూసి రమ్మని కూర్చోబె ట్టి పళ్ళెంలో ఆహారం వడ్డించింది. కడుపునిండిన రా జు ఆమెకు కాసుల మూట ఇవ్వబోయాడు. ఆమె తిర స్కరించి ‘ఇది నా ధర్మం, బాధ్యత. ఈ రాజ్యంలో ఆకలితో ఎవ్వరూ అలమటించరాదని మా రాజుగారు ఇలాంటి ఏర్పాట్లు పలుచోట్ల చేశారు” అని చెప్పింది. తానూ రాజైనా తనకెందుకీ ఆలోచన రాలేదా అని ఆ రాజు విచారించాడు. ఆమెకు కృతజ్ఞతలు తెలిపి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. తన రాజ్యంలో కూడా అలాంటి ఏర్పాట్లు చేయాలని సంకల్పించి వెంటనే ప్రారంభించాడు. ఇది కథే అయినా ఇందులో మనిషి ప్రాణం నిలబెట్టే ఆహారం గురించిన ప్రస్తావన ముఖ్య మైనది. క్షుద్బాధ భయంకరమైనది. సమయానికి ఆహారం అంది కడుపునిండితే చైతన్యశక్తి నిలుస్తుంది. లేకపోతే ప్రాణాలు కొడిగట్టిపోతాయి. ఆకలికి సమ యాసమయాలు, రుచీ శుభ్రత, గొప్పా బీదా అన్న తేడాలు ఉండవు.
శరీరం, శక్తి ఉన్నప్పుడు ధర్మమార్గంలో ద్రవ్యా న్ని ఆర్జించి కడుపు నింపుకోవాలని శాస్త్రాలు చెబుతు న్నాయి. తాను, తనతోపాటు ఇతరులు కూడా సామూ హకంగా ఆహారాన్ని పంచుకోవాలి. పూర్వం రోజుల్లో అతిథికి సంతర్పణ చేసిగాని ఎవరూ ఆహారాన్ని స్వీక రించేవారు కాదు. భోజన వేళ అయ్యేసరికి అతిథులను వెతికి తెచ్చేవారు. చేతులకు నిజమైన ఆభరణాలు కంక ణాలు, అంగుళీయాలు కాదు. పిడికెడు మెతుకులు పంచి సాటిమనిషి కడుపునింపేవి అందమైన వేళ్లు! ఏ కార్యకలాపాలు సాగాలన్నా కడుపు చల్లబడాలి. భగవ ద్రూపమైన ఆహారాన్ని పవిత్రంగా ఆరాధించాలి. భద్ర పరచుకోవాలి, ఇతరులకు పంచాలి. ప్రాణం నిలిపే ఆహారం విలువ తెలియక నిర్లక్ష్యంతో నేల పాల్జేస్తు న్నాం. అవసరమైన వేళ ఆర్తులకు నాలుగు మెతుకులు విదిలించని మనం ఆడంబరాల పేరిట ఉత్సవాల్లో, సంబరాల్లో మిగిలిన పదార్థాలను మట్టిలో పడేస్తు న్నాం. లోకంలో కోట్లాది ప్రాణులు సరైన తిండి దొరకక అలమటిస్తున్నారు. రాశులకొద్దీ ఆహారం సద్వి నియోగం కావడం లేదు. ఇలాంటి స్థితిలో ఆకలి బాధ లు, ఆహారం విలువ తెలిసిన కొందరు ముందుకు దూకి శుభకార్యాలలో, పం డుగలలో ఉపయోగించని ఆహారాన్ని దాతల ద్వారా సేకరిస్తున్నారు. అన్నమో రామచంద్రా అని అలమటించే అభాగ్యులకు వడ్డన చేస్తున్నారు. ఆహారంపట్ల తమ ప్రేమను చాటుతు న్నారు. ఒక మహాయజ్ఞంలా కొనసాగిస్తున్నారు. అవకాశాలను సృష్టించుకొని పలు వురు దాతలు వారికి సహకరిస్తున్నారు. మానవ మనుగడకు కనీస సదుపా యాలైన ఆహారం, నివాసం, వస్త్రం లభించని దీను లెందరో. చాలా ఇళ్లలో ఉపయోగించని వస్త్రాలు దర్శ నమిస్తాయి. అవి అభాగ్యులకు చేరితే చిరుగుల బతు కులకో చిన్న ఆశ.
సర్వ ప్రాణులను సమంగా ఆదరించేవారు, ఇత రుల దు:ఖాన్ని తమదిగా స్వీకరించేవారు ఉత్తములని గీతలో పరమాత్మ చెప్పిన మాటలు దీనులను పరికిం చినప్పుడు జ్ఞప్తికి రావాలి. దేవుణ్ని స్మరిస్తూ చేసే అన్న దానం భగవంతుడిని చేరుతుంది. ఈ యజ్ఞంలో తా మూ పాల్గొనాలనే తలపు బలంగా నాటుకోవాలి. మూసుకున్న మానవ హృదయ మందిర ద్వారాలు తెరచుకోవాలి. కారుణ్యపు జేగంటలు మది మదిలో మోగాలి. గింజ రక్షణకు కర్షకుడు పడే కష్టం కళ్లముం దు కదలాడాలి. అమృత సమానమైన అన్న కణాలు అన్నార్తులకు చేరాలి. కడుపునిండినవారి ముఖాల్లో ఆనందం తాండవించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement