Wednesday, May 1, 2024

సమతావాది… సత్యసాయి

ప్రేమ, శాంతి, సమానత్వమే మతంగా బోధించిన మహ నీయుడు సత్యసాయి. సాయిధ్యానంతో అధ్యాత్మిక నగరి పులకించి పోతున్నది. అయిదు రోజుల అంగరంగవైభవం గా కార్యక్రమాలు జరుపుతున్నారు. పుడమి నాలుగు చెర గుల నుంచీ భక్తులు అభిమానులు పుట్టపర్తికి చేరుకున్నారు.
మద్యం, ధూమపానం, మాదక ద్రవ్యాలకు దూరం గా ఉండి శాకాహారులుగా సాగాలని, ఇంద్రియ నిగ్ర#హం, ధ్యానం, తల్లిదండ్రులు, గురువులు, పెద్దల పట్ల భక్తి ఆయన ప్రధాన బోధనలు. ప్రపంచ మానవాళిని సౌభ్రాతృత్వ భావంతో ఏకం చేయడం కర్తవ్యమని, ఐక్యత అనే జ్యోతిని ఆరిపోనీయవద్దని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తుల ఆరా ధ్య దైవం భగవాన్‌ సత్యసాయిబాబా ప్రవచించేవారు.
సత్యసాయి 25వ జన్మదినోత్సవం రోజున ప్రశాంతి నిలయం ప్రారంభోత్సవం చేసినప్పటినుంచి బాబా కీర్తి ప్రతిష్టలు దేశ దేశాలకు వ్యాపించాయి. సత్యం, ధర్మం, శాం తి, ప్రేమ, అ#హంస అనే సనాతన ధర్మాలను ప్రచారం చేస్తూ ప్రశాంతి నిలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. పుట్టపర్తికి వస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం.

సమాజ సేవలు..

మానవ జాతిలో పతనమైపోతున్న నైతిక విలువల ను, సేవా భావాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఈ కలియుగం లో మానవ రూపం ధరించి వచ్చి న దైవ స్వరూపులుగా భక్తులు సత్య సాయిని భావిస్తారు. నిస్వా ర్థ ప్రేమతత్త్వాన్ని మానవులలో పెంపొందించడం ద్వారా అత్యు న్నతమైన దివ్యత్వ స్థాయికి మా నవులను చేర్చగలమని సత్యసా యి అనేక సందర్భాలలో ఉద్బో ధించారు. క్రమ శిక్షణతో సేవా దృక్ఫథాన్ని అలవరచుకుని ఆ యన చూపిన బాటలో అసంఖ్యా కులు సమాజ సేవకులుగా స్వ చ్ఛందంగా కదిలి వచ్చారు. #హం స, నేర ప్రవృత్తి, ద్వేష భావం, పూర్తిగా నిర్మూలింపబడాలని ఆయన పలుమార్లు పేర్కొన్నారు. లోకంలో సుస్థిరమైన శాంతి నెలకొనాలంటే మానవులలో ప్రేమ భావన పెంపొం దాలని వారు ప్రతి ఉపన్యాసంలో తెలియజేసేవారు.
మానవ సేవలోనే మాధవుణ్ని చూసి తరించమని తన భక్తులకు నిర్మాణాత్మకంగా తెలియజేశారు. కుగ్రామమైన పుట్టపర్తిలో పేదలకు వైద్య సౌకర్యార్థం నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఇందుకు ప్రధానమైన ఉదా#హరణ. సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతూ మనుషులంతా ఒక్కటేనని సెలవిచ్చారు. అన్ని మతాల సారమూ ఒకటేనని, మనిషిని మనిషి ప్రేమించాలి అని పలుమార్లు చెప్పారు. వీణలో తీగెలు వేరువేరుగా ఉంటున్నాయి కాని వీణ ఒక్కటే. అదే విధంగా ఈ దేశమంతా ఒక వీణ, మతాలే తీగెలు. వీణలో ఏ ఒక్క తీగె అపస్వ రం పలికినప్పటికీ వినడానికి ఇంపు గా ఉండదు, కనుక అన్ని మతాల క్షేమాన్ని, అందరి సంక్షేమాన్ని మనం ఆశించాలని 1999లో జన్మ దినోత్సవ సందేశంలో మత సామ రస్యం గురించి ఉద్బోధించారు.
బాబా శివైక్యం చెంది 19 ఏళ్లు అవుతున్నా.. భక్తుల తాకిడి ఏ మా త్రం తగ్గకుండా వెలుగొందుతోంది ప్రశాంతినిలయం. బాబా భౌతికం గా లేకపోయినప్పటికీ తమ #హృద యాలలో నెలకొని ఉన్నాడని భక్తు లు విశ్వసిస్తున్నారు. సత్యసాయి బాబా ఆధ్వర్యంలో ప్రత్య క్షంగా, ఆయన సేవా సంస్థల ఆధ్వర్యంలో అసంఖ్యాకంగా విద్య, సేవ, దాన కార్యక్రమా లు నడుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 166 దేశాలలో 10,000 సత్యసాయి సేవా సంస్థ లున్నాయి. దేశ దేశాలలో సాయి సమితులున్నాయి. సత్య సాయి సమితి చి#హ్నం ఐదు దళాల పద్మం. ఈ ఐదు దళా లు ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం, అ#హంసలకు చిహ్నాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement