Sunday, July 14, 2024

ధర్మం – మర్మం : స న్మిత్రుడు (డి)

మహాభారత సంకలనం సుభాషిత సుధానిధిలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

ఉపకార్యోపకారిత్వం దూరేచేత్‌ సాహిమిత్రతా
పుష్పవంతౌ కి మాసన్నౌ పశ్య కైరవ పద్మయో:

ఉప కారము చేసేవారు ఉపకారమును పొందువారు ఎంత దూరంగా ఉంటే అంత మంచి మిత్రులు. సూర్యచంద్రులు, పద్మము కలువలు దగ్గరగా ఉన్నాయా?

అనగా ఒక వ్యక్తికి ఉపకారము చేసిన వారు దానిని సాకుగా పెట్టుకొని ఆ వ్యక్తి వెనకే, అతని వద్దే ఉండటం సరియైన పద్ధతి కాదు. సహాయము చేసినవారు, సహాయమును పొందిన వారు
వీలున్నంత దూరముగా ఉంటేనే నిజమైన మైత్రి. దీనికి దుష్టాంతం సూర్యుడు పద్మమును వికసింపచేయును, కానీ సూర్యుడు – పద్మము సమీపంగా ఉండవు. అలాగే చంద్రుడు కలువలను వికసింప చేయును కానీ చంద్రుడు- కలువ సమీపంగా ఉండవు. అందుకే ఉప కారము చేసిన వారు, ఉపకారము పొందిన వారు దూరముగా ఉంటేనే ఆ మైత్రి రాణించును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement