Thursday, May 2, 2024

ధర్మం – మర్మం : త్రయంబక తీర్థము (ఆడియతో..)

గౌతమమహర్షి ద్వారా ఆవిర్భవించిన గోదావరీ నదీ తీర్థముల వైభవము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

బ్రహ్మ చెప్పిన భాగీరథీ అవతరణను విన్న నారదుడు ఈ వృత్తాంతమును తెలుసుకున్నను తనకు తృప్తి కలుగలేదని విడివిడిగా ఆయా తీర్థముల ఫలమును తెలుపమని మొదటగా గౌతమ మహర్షి భూమికి తీసుకుని వచ్చిన గోదావరీ నదీ తీర్థముల వైభవమును వివరించమని అడిగెను. విడివిడిగా ఆయా తీర్థముల ఫలమును ఇతిహాస పూర్వకముగా తెలుపమని నారదుడు బ్రహ్మను ప్రార్థించెను. ఆయా తీర్థముల వేర్వేరు విభాగమును, ఫలమును, మహాత్మ్యమును సంగ్రహంగా చెప్పెదెనని సావధానంగా వినమని త్రిలోచనునకు నమస్కరించి బ్రహ్మ చెప్పనారంభించెను.

త్రయంబక తీర్థము :
త్రయంబకుడు అనగా త్రిలోచనుడు. అనగా శంకరభగవానుడు ఉన్న తీర్థమును ‘త్రయంబక’ తీర్థముగా వ్యవహరించెదరని, ఈ తీర్థము భుక్తిముక్తిప్రదమని బ్రహ్మ నారదునితో పలికెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు….
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement