Thursday, April 18, 2024

ధర్మం – మర్మం : కుశావర్త తీర్థము (ఆడియతో..)

కుశావర్త తీర్థ వైభవము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

కుశావర్త తీర్థ వైభమును వర్ణించుటకు తన శక్తి చాలదని తెలిపిన బ్రహ్మ ఈ తీర్థమును స్మరించినంత మాత్రమునే మానవుడు తాను చేయవలసినవన్నీ చేసినవాడగునని నారదునితో పలికెను. కుశావర్తమను తీర్థము నరులకు సకలాభీష్టములను ప్రసాదించును. ఈ ప్రాంతమున గౌతమ మహర్షి దర్భలను, మూడు మార్లు గుండ్రముగా తిప్పి దీనిలో నుండి శివ జటాజుటమున ఉన్న గంగను తీసుకునిపోయెను. కావున ఈ కుశావర్తమున స్నానము, దానము సకల పాపహరము. ఈ తీర్థమున పితరులను ఉద్దేశించి శ్రాద్ధము , పిండప్రదానం జరిపినచో పితృదేవతలకు తృప్తి కలుగును. కుశావర్త తీర్థమునకు వెళ్ళలేని వారు ఉన్న చోట నుండే ‘కుశావర్తం’ అని మూడు మార్లు స్మరించినచో 21తరముల వారు తరించెదరని బ్రహ్మ నారదునితో కుశావర్త తీర్థము గురించి వివరించెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు….
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement