Thursday, February 22, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు (ఆడియోతో…)

మహాభారతంలోని సుభాషితంపై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

అతిసాహసం అతి దుష్కరం అత్యాశ్చర్యంచ దానమర్ధానాం
యోహిదదాతి శరీరం నదదాత్రి సవిత్త లేశమపి

వస్తువులను ఇతరులకు దానము చేయుట అతి సాహసము. అలాగే ఎంతో దు:ఖముతో కూడా చేయ శక్యము కాని ది ఆ విధంగా చేసిన నాడు చూచే వారికి చాలా ఆశ్చర్యమును కలిగించును. శరీరమును ఇచ్చిన వాడు తనకున్న ధనంలో కొద్దిభాగాన్ని కూడా ఇవ్వలేడు.

తనది అనుకున్న వస్తువు తనకు తానుగా ఇతరులకు అర్పించడం, అర్పించాలనే ఆలోచన కలగ డం సాహసమే కదా. దానిని అందరూ చేయలేరు. అలా చేసినపుడు అది ఆశ్చర్యకరమే. అందుకే దానము సాహసము, దుష్కరము మరియు ఆశ్చర్యకరము. శరీరమును ఇచ్చువాడు ధనమును ఏ మాత్రము ఇవ్వడు. అనగా ధనము సంపాదించన వాడు తాను సంపాదించిన ధనమును ఏ మాత్రము ఇతరులకు ఇచ్చుటకు ప్రయత్నించని నాడు తన శరీరమును దానమీయవలసి వచ్చును. అనగా దొంగలు, దొరలు, బంధవులు, మిత్రలుగా చెప్పుకొనే వంచకులు శరీరాన్ని పలు రకాలుగా హింసించి అతని ధనమును అపహరించును. ఇట్లు ధనము ఈయని వాడు ఇతరుల హింసకు బాధలకు తన శరీరాన్ని దానమిస్తున్నాడని భావం.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూనే శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement