Friday, May 3, 2024

ధర్మం – మర్మం

గంగా ఆవిర్భావ వృత్తాంతములో సగరునికి నారదుడు తెలిపిన సగర పుత్రుల దుర్గతి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

రాక్షసులు చేసిన అపకారము, కపిల మహర్షి ప్రభావము, అశ్వము యొక్క స్థితి అంతా తెలిపి సగర పుత్రులు నశించడాన్ని నారదుడు సగర చక్రవర్తికి తెలియజేయగా అతను చింతాక్రాంతుడయ్యెను. సగరుని మరో కుమారుడైన అసమంజుడు బాల్యంలో సరయులో స్నానము చేయుచూ బాలకులను, పౌరులను ఆ నీటిలో ముంచి వధించుచూ క్రీడించుచుండెను. అంతట ఆ పౌరులు కుమారుని దురువృత్తమును రాజుకు తెలియజేయగా ఆగ్రహించిన సగర మహారాజు తన కుమారుడిని రాజ్యము నుండి బహిష్కరించెను. అరవై వేల మంది పుత్రులు కపిల తేజస్సుతో నశించిరి, అసమంజుడు అడవులపాలయ్యెను తానేమి చేయవలయెనని ఆలోచించిన సగరుడు అడవిలో ఉన్న అసమంజుని పుత్రుడు అంశుమంతుడిని తీసుకుని వచ్చి జరిగిన దానిని వివరించి కర్తవ్యమును బోధించెను. అంశుమంతుడు పండితుడు, జ్ఞాని, బుద్ధిమంతుడు , వినయసంపన్నుడు కావున శ్రద్ధా భక్తులతో రసాతలమునకు వెళ్ళి వినయముతో కపిలమహర్షిని ఆరాధించి అతని అనుగ్రహంతో అశ్వమును తీసుకునివచ్చి సగరునికి అప్పగించగా, అశ్వమేధ యాగము పూర్తయ్యెను.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement