Sunday, June 23, 2024

ధర్మం – మర్మం

గంగా వైభవం, గౌతముడు గంగను సేవించిన విధానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

సర్వత్ర సర్వభూతైవ సర్వ పాప వినాశినీ
సర్వ కామ ప్రదానిత్యం సైవ వేదే ప్రగీయతే
మర్త్యా మర్త్య గతామేవ పశ్యంతి న తలంగతాం
నైవ స్వర్గ గతాం మర్త్యా: పశ్యంతి అజ్ఞాన బుద్ధయ:
యావత్‌ సాగరగా దేవి తావత్‌ దేవ మయీ స్మృతా
ఉత్సృష్టా గౌతమేనైవ ప్రాయాత్‌ పూర్వార్ణవం ప్రతి

తాత్పర్యము :
ఈ గంగా వైభవం వేదములలో కూడా గానము చేయబడినది. మానవుడు మానవలోకములో ఉన్న గంగను మాత్రమే చూడగలడు. రసాతలము మరియు స్వర్గమున ఉన్న గంగను అజ్ఞాన బుద్ధుడైన మానవుడు చూడజాలడు. సముద్రమును చేరువరకు ఈ గంగా దేవతా స్వరూపమున ఉండును. గౌతమునిచే విడువబడి పూర్వ సముద్రమున చేరినది.

ఈవిధంగా దేవతలు, ఋషులు, యక్షగంధర్వాదుల చేత పూజించబడిన లోకమాత మరియు జగత్తుకు శుభమును కలిగించు గంగకు గౌతమ మహర్షి ప్రదక్షిణము చేసెను.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement