Monday, April 29, 2024

జనసంద్రంగా ముచ్చింతల్‌..!!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జగద్గురు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతు న్నాయి. ఆరోరోజు వేడుకల్లో భాగంగా వైభవోపే తంగా రుత్వికులు యాగ క్రతువులు నిర్వ హించారు. సోమవారం లక్ష్మీనారా యణ మహాయాగం కొనసాగింది. మరోవైపు సమతామూర్తి విగ్రహాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంలో ఎక్కడ చూసినా ముచ్చింతల్‌ శ్రీరామనగరం సందడిగా మారింది. సోమవారం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సమతామూర్తి కేంద్రం లో 33 స్త్రీ దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠాపన చేశారు. వాటిని 108 దివ్య దేవాలయాల్లో ప్రాణ ప్రతిష్ఠ చేశారు. చినజీయర్‌ స్వామి పర్యవేక్షణలో యాగశాల నుంచి 33 స్త్రీ దేవతా మూర్తులతో శోభయాత్ర నిర్వహించారు. ఇందులో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. అహోబిలం జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో ఇష్టి మండపంలో హోమాలు నిర్వహిం చారు. ప్రవచన మండపంలో సుమారు 300 మంది భక్తులతో చినజీయర్‌ స్వామి శ్రీరామ అష్టోత్తర నామ పూజ చేశారు.
భారీగా తరలివస్తున్న భక్తులు
ముచ్చింతల్‌లోని సమతా కేంద్రానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. యాగం, శోభాయాత్ర, సాంస్కృ తిక కార్యక్రమాలను భక్తులు తిలకించేందుకు తండోప తండాలుగా వస్తున్నారు. ఆదివారం లక్ష మందికిపైగా భక్తులు సందర్శించగా, సోమ వారం వేలాది మంది భక్తులు తరలి వచ్చినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement