Saturday, June 1, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

సమయం అయిపోయిన తర్వాత కన్నా సమయం లోపలే మార్పులు చేయడం ముఖ్యం. బయటి ప్రపంచపు శైలి, పోకడలు వంటి బహ్య మార్పులను మనము చాలా తొందరగానే స్వీకరించుతాం. అయితే మన చెడు అలవాట్లు, పద్ధతులు మార్చుకోవడంలో నెమ్మదిగా ఉంటాము. అహంకారము లేక స్వయము పైన గౌరవం లేకపోవడం కావచ్చు. మనం మనలో మార్పునకు వ్యతిరేకంగా తిరుగుబాటు దారుడుగా మారుతాము. మనకు అలవాటైన పాత తెలిసిన అలవాట్లతోనే, అవి మనలను ఎంతగా పరిమితం చేస్తున్నా సర్దుకుపోతాం. అహంకారం స్వయాన్ని పరిమితమైన హద్దులకే లోబడి ఉండడానికి సర్దిచెప్తుంది. మనలను తక్కువకే సంతృప్తం చేస్తుంది. మనం తప్పకుండా మారాలని కోరుకుంటున్నాము. ఈరోజు నాలోని సమర్ధతను జాగృతం చేసి అంతర్‌ పరివర్తనను ఆహ్వానం చేస్తాను.

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement