Sunday, May 5, 2024

కర్తవ్య నిష్ఠ

పుట్టిన ప్రతీ మనిషి ఏదో ఒక కర్తవ్యం చేస్తూనే ఉండాలి. పిల్లలకు శ్రద్ధతో చదువుకొని జ్ఞానాన్ని పొంద డం కర్తవ్యం. తల్లికి పిల్లల సంరక్షణ, భర్తకు సహకరిస్తూ, సహ ధర్మచారిణిగా ప్రవర్తించడం కర్తవ్యం. తండ్రికి కుటుంబ పోషణకు డబ్బు సంపాదించడం, తన కుటుం బాన్ని నైతికతతో నడిపించడం కర్తవ్యం. మనం చేసే పనిని ఒక దైవ సంకల్పితంగా భావించి, ధర్మబద్ధంగా చేయడమే కర్తవ్యం. విధిగా చేయవలసిన పనిని కూడా కర్తవ్యం అనే అంటారు. ఇక నిష్ఠ అంటే పనిని నియమ బద్ధంగా, శ్రద్ధతో మనసు లగ్నం చేసి, దీర్ఘకాలం చేసే పని. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది పనిని నిర్లక్ష్యంగా, అశ్రద్ధతో చేస్తూ, విముఖతతో ఉంటారు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో —
”నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ అకర్మణ:
శరీర యాత్రాపి చతాన ప్రసిద్ధ్యేత్‌ అకర్మణ:!!
అంటే ‘ఎల్లకాలము ఏదో ఒక పనిని చేస్తూనే ఉం డాలి. పని చేయకుండా కూర్చోడమేమిటి? కాలాన్ని నిరు పయోగం చేయకుండా, పనిలో నిమగ్నమవ్వాలి. కృషి చేయని వాడికి దైనందిన జీవితం సక్రమంగా సాగదు.”
అందుకే మనిషి తన శక్తిసామర్థ్యాలకు లోబడి, జీవనం సాగించడానికి, ఏదో ఒక వృత్తిని చేపట్టవలసి వస్తుంది. సృష్టిలో అంతర్భాగంగా ఉన్న వాయు దేవుడు గాలిని స్థభింపచేసినా, వరుణుడు సకాలంలో వర్షించక పోయినా, తెల్లారేసరికి ఉదయించే సూర్యుడు ఉద యించకపోయినా, జీవన విధానం స్థంభించి పోతుం ది. అస్తవ్యస్తమైపోతుంది. పక్షులు కూడా తమ ముక్కు సహాయంతోనే పుల్లలు ఏరి గూడు కట్టుకొంటుంది. పిచ్చుకలు గడ్డి పరకలను ఏరి తెచ్చి అందంగా గూడు నిర్మించుకొంటాయి. చేతులు లేవు, టెక్నాలజీ తెలియ దు. చదువుకోక పోయినా, నిరంతరం అన్వేషణలో ఉం టాయి. ప్రకృతిలోని ప్రతీ అంశం మనకు జ్ఞానోదయమే.

కర్తవ్య నిష్ఠ వల్ల ప్రయోజనాలు

వ్యక్తిత్వ నిర్మాణం, ఆత్మ విశ్వాసం పెంపొందుతాయి.
క్రమశిక్షణ, ఇతరులతో సాన్నిహిత్యం పెంపొందుతా యి. మనిషి ఔన్నత్యానికి, విజయానికి కర్తవ్య నిష్ఠ ఎంతో దోహదపడుతుంది. బంధుప్రీతితోనో, స్వలా భేక్షతోనో, ఇతరులు నుండి ఆర్థికంగా కాని, మరే రూపం లోనైనా ప్రతిఫలం ఆశించి చేసే పనులకు గుర్తింపు ఉం డదు. ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు.
వివేకానందుని మాటల్లో- ”ఏదైతే మనల్ని ఉన్న తంగా ఎదిగేలా చేస్తుందో అది మంచి కర్తవ్యం. ఏదైతే మనల్ని దిగజారుస్తుందో అది మన కర్తవ్యం కాదు. చెడు అలవాట్లు, భావనలు మనిషిని దిగజారుస్తాయి.” కాబట్టి, కర్తవ్య నిర్వ#హణలో ధర్మంగా వ్యవహరించాలి.
మనిషి తమోగుణం, రజోగుణం, సత్త్వ గుణం అనే మూడు గుణాలకు ప్రభావితుడై ప్రవర్తిస్తుంటాడు.
మనసు, ఇంద్రియాలు కర్తవ్యం మీద లగ్నంచేసి నిగ్ర హంతో పట్టుదలతో, చేసేవారు సాత్త్విక దృష్టి కలవారు.
ఫలితంపై అధికాశక్తితో అవసరమైతే అధర్మంగానైనా చేసే కర్తవ్య నిర్వాహ‌కులు రాజస దృష్టి కలవారు.
కలలుకంటూ, భయంతో, సందిగ్ధం స్థితిలో పట్టుద లతో కర్తవ్యాన్ని చేసేవారు తామసిక దృష్టి కలవారు.
సుందరకాండలో సీత జాడ లంకలో కనపడక హనుమ నిరాశగా కూర్చొని ఆలోచిస్తాడు.
”ఎంతటి చిన్న కార్యమైనా, దానిని సాధించడానికి ఒకే ఉపాయం ఉండదు. అనేక ఉపాయాలు ఉంటాయి. అందుచేత కార్యమును సాధించడానికి ఎవరికి అనేక ఉపాయాలు తెలియునో అతడే కార్యసాధకుడు.” అని. కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభంలోనే బంధుప్రీతితో కర ్తవ్యాన్ని విస్మరిస్తున్న అర్జునుడుకు, తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ చేసిన బోధే ‘భగవద్గీత’గా అందించబడింది.

  • అనంతాత్మకుల రంగారావు,7989462679
Advertisement

తాజా వార్తలు

Advertisement