Friday, May 3, 2024

బాహ్యాంతర దేహ జ్ఞానము

ఆధునిక వైద్యశాస్త్రము కూడా పరిశోధన చేయనంత అద్భుతంగా మానవ దే హాన్ని విశ్లేషించిన శ్రీ శంకర భగవత్పాదులు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మ అంశయే అని భావించవచ్చు.
‘శంకర శ్శంకర స్సాక్షాత్‌” వారు లయకారుడైన ఆ కైలాసనాధుని అవతారము. వైద్యులందరూ ఆయన రచించిన వివేకచూడామణిని అభ్యసించవలసిన అవసరము న్నది. శ్రీశంకరులు రచించిన మూడువందలకు పైగా గ్రంథములలో ఒక గొప్ప వి జ్ఞాన గని ఈ ‘వివేక చూడామణి’.
సప్తధాతువులయిన మజ్జ, అస్థి, క్రొవ్వు, మాంసము, రక్తము, చర్మము, శుక్రము తో నాది, నేను అను అహంకార, మమకారములకు ఆశ్రయము స్థూల దేహము. వీటి యొక్క సూక్ష్మ భూతములు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అను పంచ భూతములు. ఇది నింద్యమైన మలమూత్ర భరితమైనది. గృహస్థునకు గృహము ఎటువంటి దో జీవునకు ఈ స్థూల శరీరము అటువంటిది.
చెవి, చర్మము, ముక్కు, కన్ను నాలుక ఇవి విషయ జ్ఞానము కలిగించు ఇంద్రియ ములు. కనుక వీటిని జ్ఞానేంద్రియములు అన్నారు. మాట, చెయ్యి, పాదములు, గుద ము, ఉపస్థము ఇవి స్థూల శరీరము నడుపుటకు కావలసిన కర్మలు చేస్తుంటాయి. అన గా తినుట, మాట్లాడుట. నడచుట, చేతులతో పనులు చేయుట, విసర్జించుట, పునరు త్పత్తి చేయుట మొదలయినవి. కావున వీటిని కర్మేంద్రియములు అన్నారు.
ఇక అత్యంత ముఖ్యమైనవి అంత:కరణ చతుష్టయము. అవి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇవి ప్రస్థుతము కంప్యూటరులో ఉపయోగించే అంతర్గత సా ఫ్ట్‌వేర్‌ భాషలాంటివి. మానవ దేహాన్ని ఒక యంత్రముగా భావిస్తే దానిని నడిపించే అం తర్జాల శక్తి ఈ అంత:కరణ చతుష్టయము. ఇవి సవ్యముగా నడచినచో దేహము కొంత కాలము ఆరోగ్యముగా పనిచేస్తుంది. ఈ దేహాన్ని నడపటానికి ప్రధాన ఇంధనము వా యువు. ఇది ఐదు రకాలుగా పనిచేస్తుంది. ప్రాణము, అపానము, వ్యానము, ఉదా నము, సమానము. వీటినే పంచ ప్రాణములు అన్నారు. ఇవి అన్నియూ స్థూల శరీర ములో భాగములు. ఇక అత్యంత ముఖ్యమైనది, రహస్యమైనది సూక్ష్మ శరీరము.

వాగాది పంచశ్రవణాది పంచ
ప్రాణాది పంచాభ్రముఖాని పంచ
బుద్ధ్యాద్య విద్యాపి చ కామకర్మణీ
పుర్యష్టéకం సూక్ష్మ శరీర మా#హు:

జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, పంచప్రాణములు, పంచ భూతములు, అంత:కరణ చతుష్టయము, అవిద్య, కామము, కర్మ ఈ ఎనిమిదింటిని పుర్యష్టకమంటారు. ఇవి మొత్తముగా చూస్తే ఇరవైఏడు. వీటితో నడచుచున్నది మీ సూక్ష్మశరీరము. ఇది వాసనలతో కూడియున్న కర్మలను చేయుచూ ఫలితమును అను భవించును. ఈ సూక్ష్మ శరీరమనే లింగ శరీరమని కూడా అంటారు. ఇదియే ఆత్మకు ఉపాధిగా ఉంటున్నది.
దీనికి స్వస్వరూపము లేదు. స్థూల శరీరము, ప్రాణములు తమ ధర్మములైన ఉచ్ఛ్వాస నిశ్శ్వాసములు, ఆవులింత, తుమ్ము, అదరుట మొదలైనవాటిని నిర్వర్తించు నంత వరకు నిలబడుతుంది. అని ఆగిన పిమ్మట ఉత్క్రమించి పడిపోతుంది. ఇక సూక్ష్మ శరీర మనుగడలో అ#హంకారము అత్యంత ప్రాధాన్యత సంతరించుకొను చున్నది. కర్తను, భోక్తను, నేను నేను అను అభిమానమును నిరంతరము ప్రకటించున దియే అ#హంకారము. ఇది మూడు రకాలుగా ఉండును. అవి సాత్త్విక, రాజస, తామస అ#హంకారములు. ఈ అ#హంకారమే సుఖదు:ఖాలకు కారణము. వీటికి ఆతీతమైనది నిత్యానంద స్వరూపమైన ఆత్మ.
కామము, క్రోధము, లోభము, దంభము, అసూయ, ఈర్ష్య, మత్సరము ఇవి రజోగుణ అహంకార లక్షణములు. ఇవి కర్మబంధన హతువులై జీవుని ప్రవృత్తులలో నిలుపుచున్నవి.
అభావన, విపరీత భావన, అనంభావన, విప్రతిపత్తి, భ్రాంతి’ మొదలైనవి తమో గుణ అహంకార లక్షణములు. దేహాత్మ భావన అనునది దీని ప్రధాన లక్షణం. దీని వల న జీవుడు అజ్ఞానము, అలసత్వము, జడత్వము, నిద్ర, ప్రమత్తత, మూఢత్వమును కలిగి జడుడై ఉండును. ప్రసన్నత, ఆత్మానుభవము, పరమశాంతి, తృప్తి, ప్రహర్షము. పరమాత్మయందు నిష్ఠ ఇవి విశుద్ధ సత్త్వగుణ అ#హంకార లక్ష్మణములు. ఇక్కడ అహంకారము శుద్ధమై నిత్యానందమును పొందుతుంది. ఈ దేహము ఆత్మ కాదు అను సత్యమును సత్త్వగు ణ సంపన్నుడు తెలుసుకుంటాడు.
ఇక జాగ్రదావస్థ యందు చేసే కర్మల ఫలితాలు, వాసనా రూపంలో కారణ శరీ రంలో నిక్షిప్తం చేయబడతాయి. ఇవి పునర్జన్మకు కారణమవుతాయి. ఇది అవ్యక్త మైనది. దీనిలో త్రిగుణాలు ఉంటాయి. ఆత్మతో కారణ శరీరం కలసిపోతుంది. సుషుప్తి అవస్థలో ఈ కారణ శరీరం భాసిస్తుంది. కారణ శరీరం జ్ఞానశక్తికి ఆశ్రయంగా నిలు స్తుంది. నిజానికి స్థూల, సూక్ష్మ కారణ శరీరాలు మూడూ అనాత్మ రూపాలే!
పైన పేర్కొన్న వాటన్నికే అతీతముగా పుట్టక, గిట్టక, పెరుగక, తరగక, వికారము ను పొందక, లయము చెందక, కర్మలు చేయక సర్వమునకు సాక్షియై, నిత్యమై ఉండు నది యే ఆత్మ. ఆత్మను ఆత్మయే తెలుసుకొనగలదు. నేను నేను అను అ#హం కారము జ్ఞానముచే తుదకు ”ఇది నేను” అని అంత:కరణములో అనుభవమునకు వచ్చుటయే ”ఆత్మ” అనియు, అదియే ఆత్మజ్ఞానమనియు శ్రీ శంకరులు నిరూపించియున్నారు.
ఆహార విహారాదులను నియంత్రించుకొని, త్రిగుణములతో సత్త్వగుణమును ప్రధానము చేసుకొని ఆత్మ జ్ఞానమును పొందవచ్చునని తెలియచేసారు. ఈ బాహ్యాం తర దే#హ జ్ఞానముతో ప్రస్తుతం లభించిన ఈ మానవ జన్మను ఆనందమయం చేసుకోవడం మన వివేకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement