Monday, May 6, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 8
08
భవాన్‌ భీష్‌మశ్చ కర్ణశ్చ
కృపశ్చ సమితింజయ: |
అశ్వత్థామా వికర్ణశ్చ
సౌమదత్తిస్తథైవ చ ||
తాత్పర్యము : యుద్ధమునందు ఎల్లప్పుడును విజయమును సాధించు మీరు, భీష్‌ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తయుడైన భూరిశ్రవుడు వంటివారు మన సైన్యము నందున్నారు.

భాష్యము : దుర్యోధనుడు తన తరపు యోధుల గురించి, ప్రత్యేకించి ఓటమి ఎరుగని వారిపేర్లను తెలుపనారంభించె ను. అందు వికర్ణుడు, దుర్యోధనుని సోదరుడు. అశ్వత్థామ, ద్రోణాచార్యుని తనయుడు. సౌమదత్త, బాహ్లికుల రాజు. కర్ణుడు, కుంతీపుత్రుడు, పాండురాజును వివాహమాడక ముందు పుట్టినవాడు. అలాగే కృపాచార్యుని కవల చెల్లెలు ద్రోణాచార్యుని భార్య.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement