Friday, May 17, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 6, శ్లోకం 24

సంకల్పప్రభవాన్‌ కామాన్‌
త్యక్త్వా సర్వానశేషత: |
మనసైవేంద్రియగ్రామం
వినియమ్య సమంతత: ||

తాత్పర్యము : స్థిరనిశ్చయముతో శ్రద్ధను కలిగి యోగము నభ్యసించుచు మనుజుడు ఆ మార్గమునుండి వైదొలగక యుండవలెను. మానసికకల్పనల నుండి ఉత్పన్నమైన విషయకోరికల నన్నింటిని ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి, అతడు మనస్సు ద్వారా ఇంద్రియమును అన్ని వైపుల నుండి నియమింపవలెను.

భాష్యము : యోగాభ్యాసకులు ఫలితాలు రావటం లేదు అని, లక్ష్య సాధనలో వెనుకంజ వేయక దృఢవిశ్వాసముతో, ఓపికగా ముందుకు కొనసాగవలెను. ఎందువలనంటే స్థిరముగా అభ్యాసము చేసే వ్యక్తికి ఫలితాలు తప్పక వస్తాయి. ఒకసారి ఒక పిచ్చుక తన గుడ్లు సముద్రములో కలిసిపోయే సరికి, సముద్రములోని నీటిని ఖాళీ చేయుటకు ప్రయత్నించసాగెను. అంతట అది చూసిన గరుడుడు సముద్రాన్ని హెచ్చరించి ఆ గ్రుడ్లను పక్షికి ఇప్పించెనున. అలాగే మనము దృఢ విశ్వాసముతో కొనసాగితే భగవంతుడు తప్పక సహాయము చేస్తాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement