Friday, April 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 3
03
శ్రీ భగవాన్‌ ఉవాచ
లోకే స్మిన్‌ ద్వివిధా నిష్ఠా
పురా ప్రోక్తా మయానఘ |
జ్ఞాయోగేన సాంఖ్యానాం
కర్మయోగేన యోగినామ్‌ ||

తాత్పర్యము : దేవుదేవుడైన శ్రీ కృష్ణుడు పలికెను : పాపహరితుడవైన ఓ అర్జునా ! ఆత్మానుభూతిని పొందగోరు మానవులు రెండు రకములని ఇది వరకే నేను వివరించితిని. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్త్వికకల్పన ద్వారా అవగతము చేసికొనగోరగా, మరికొందరు భక్తి యోగము ద్వారా అర్థము చేసికొనగోరుదురు.

భాష్యము : కృష్ణుడు ఇదివరకే వివరించినట్లు ఆత్మను అర్థము చేసుకొనుటకు సాంఖ్యయోగము లేదా కర్మ/బుద్ధి యోగమును అవలంభించవచ్చును. అయితే సాంఖ్యయోగములో ఇంద్రియవాంఛలు లేనట్లయితేనే తాత్విక కల్పన ద్వారా ఆత్మ పరమాత్మలనడుమ గల సంబంధమును అర్థముచేసుకొనుటకు సాధ్యమవుతుంది. అదే బుద్ధి యోగములో ఇంద్రియములను భగవత్సేవలో వినియోగించడం ద్వారా పవిత్రీకరణ సహజముగా జరిగి లక్ష్యసాధన సులువవుతుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement