Monday, May 20, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 29.

భోక్తారం యజ్ఞతపసాం
సర్వలోకమహేశ్వరమ్‌ |
సుహృదం సర్వభూతానాం
జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి ||

తాత్పర్యము : నా సంపూర్ణభావన యందున్న వాడు నన్ను సర్వ యజ్ఞములకు తపస్సులకు చ రమభోక్తగను, సకల లోకములకు దేవతలకు ప్రభువుగను, సకల జీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలిసికొని భౌతిక దు:ఖముల నుండి విడివిడి పరమశాంతిని పొందును.

భాష్యము : ఈ ప్రపంచములో అందరూ శాంతిని ఆశిస్తూ ఉం టారు. అయితే ఇక్కడ భగవద్గీతలో శాంతికి సూత్రము తెలియజేయబడినది. అదేమిటంటే మానవ ప్రయత్నాల ఫలములన్నీ భగవంతునికే అర్పించవలసి ఉన్నది. ఎందువలననంటే భగవంతుడు మాత్రమే సర్వలోకాలకు, సర్వ జీవరాశికి యజమాని, ప్రభువు. ఆయనకు మించి ఎవరూ లేరు. గొప్ప గొప్ప దేవతలైన శివుడు, బ్రహ్మ కంటే ఆయన గొప్పవాడు. మోహము కారణంగా జీవి తనకున్న పరిధిలో యజమానిని, నియంత్రకుడనని భావించి భౌతిక ప్రకృతి చేతిలో కీలు బొమ్మ అయి భగవంతుడు భౌతిక ప్రకృతికి అధిపతి. మనము ఆయనను అనుకరించినట్లయితే నియమాల ప్రకారము శిక్షారులమవుతాము. కాబట్టి వ్యక్తిగతముగా లేదా అంతర్జాతీయముగా శాంతి సామరస్యములు నెలకొనవలెనన్న దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు సర్వలోకాలకు సర్వ జీవరాశులకు అధిపతియని, ఆయన మన నిజమైన శ్రేయోభిలాషి అని స్వీకరించవలసి ఉన్నది. ఇటువంటి కృష్ణ చైతన్యవ—————–ుు ద్వారా మాత్రమే సంపూర్ణ శాంతి సాధ్యమవుతుంది. ఈ శ్లోకముతో భగవద్గీత అయిదవ అధ్యాయము సమాప్తము.

Advertisement

తాజా వార్తలు

Advertisement