Sunday, February 25, 2024

ప్రథమ శివ భక్తుడు బాణాసురుడు

అత్యంత పరాక్రమశాలి, ఉగ్రమూర్తి, శక్తివంత మైన రాక్షసుడు బాణాసురుడు. ప్రహ్లాదుడి మనుమ డైన మహాబలి కుమారుడు. బాణాసుడు శోణీతపురం రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాడు. ఇతడిని మహాకాళుడని కూడా పిలుస్తారు. అసుర గురువు ఇత డికి ఎప్పుడూ సహాయపడేవాడు. శ్రీకృష్ణునితో యుద్ధం చేసిన బాణాసురుడుకి శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, అగ్ని సహాయపడ్డారు. బాణాసురుడు క్రౌంచ పర్వతం కవచంగా చేసుకుని దేవతలపై యుద్ధం చేసేవాడు.
హిమాలయాలకు వెళ్లి శివపార్వతులను తల్లిదం డ్రులుగా భావించి తపస్సు చేసాడు. శివుని అనుగ్ర హంతో అనేక వరాలు పొందాడు. ఆవిధంగా బాణాసు రుడికి వెయ్యి చేతులు ఉద్భవించాయి. ”స్వామీ! నీవు పార్వతీదేవితో సహా నా నగరం కోట రక్షకులుగా ఉం డాలి” అని ప్రార్థించాడు. బాణుని ప్రార్థనను మన్నించి పరమశివుడు పార్వతీదేవి, కుమారస్వామి, గణపతు లతో బాణుని ‘శోణపురి’ ద్వారం వద్ద కాపలా నిలిచాడు. అప్పుడు బాణుడు ‘ఓ పరమేశ్వరా! నీవు ప్రసాదించిన వేయి చేతుల పరాక్రమాన్ని ఎదిరించి పోరాడగల వీరు డు ఈ భూమిపై లేడు. దీన్ని నేనెలా భరించేది. నా శౌర్యా న్ని, పరాక్రమ క్రీడ ఎదిరించడానికి నీవు దక్క నాకు సమానమైన బలంగలవాడు ఈ విశాల మండలంలో ఎక్కడా లేడు” అని అన్నాడు. అందుకు పరమశివుడు ”ఓ బాణాసురా! ఎప్పుడు నీ కేతనం (జెండా) అకార ణంగా భూమిమీద పడుతుందో అప్పుడు నీ చేతులు తె గేటట్లుగా నీకు యుద్ధం జరుగుతుంది” అని చెబుతాడు
ఇంటికి తిరిగివచ్చిన బాణాసురుడు తన రథ కేత నం ఎప్పుడు నేలపై పడుతుందా అని వేచి చూడసాగా డు. ఇంతలో తన కూతురు ఉషాకన్య గర్భవతి అయిం దన్న సంగతి తెలిసి బాణుడు కోపంతో ఖడ్గం తీసుకుని ఉషాకన్య అంత:పురానికి వెళతాడు. అక్కడ శ్రీకృష్ణుని మనుమడు అనిరుద్ధుడు ఉంటాడు. ”ఈ నరాధముణ్ణి బంధించండి” అని ఆజ్ఞాపిస్తాడు. సైనికులు అనిరుద్ధుణ్ణి బంధించాలని ప్రయత్నిస్తారు. అనిరుద్ధుడి యుద్ధకౌశ లంతో సైనికులు దిక్కుతోచక పారిపోయారు. అప్పడు బాణాసురుడు నాగపాశంతో అనిరుద్ధుడిని బంధిస్తా డు. తీవ్రంగా గాలి వీచటంచేత బాణాసురుని నీలవర్ణ పతాకం వెంటనే అకారణంగా పెద్ద ధ్వని తో నేలపై కూలింది. పతాకం పడటం చూచి బాణుడు సంతోషపడ్డాడు. శివుడు పలికిన విధంగా జరుగుతుందని యుద్ధం కోసం ఎదురుచూడసాగాడు.
నారదమహర్షి ద్వారకకు వచ్చి అని రుద్ధుడి గురించి శ్రీకృష్ణునికి చెబుతాడు. శ్రీకృష్ణుడు యుద్ధానికి సైనికులను సిద్ధం చేయించాడు. తన రథాన్ని ఎక్కాడు. ప న్నెండు అక్షౌహిణుల బలగంతో శోణనగరం హద్దులు దాటి ఆ నగరాన్ని అంతా ధ్వంసంచేస్తాడు శ్రీకృష్ణుడు. బాణుడు కూడా తన సైన్యంతో బయలుదేరాడు. యుద్ధ భేరి మ్రోగించాడు. పరమేశ్వరుడు నందీశ్వరుడిని ఎక్కి కుమారస్వామి, ప్రమథగణాలు వెంటరాగా శూలం ధరించి బయలుదేరాడు. అప్పడు ద్వంద్వ యుద్ధం జరిగింది. హరి హరులిద్దరూ అన్నిరకాల అస్త్రాలను ప్ర యోగించుకున్నారు. చివరిగా శ్రీకృష్ణుడు సమ్మోహనా స్త్రాన్ని ప్రయోగించగా శివుడు నిద్రవచ్చి నందీశ్వరుని మూపుపై వాలిపోయాడు. బాణుడు శ్రీకృష్ణునితో తల పడ్డాడు. వేయి చేతులతో బాణాలను సంధించాడు. శ్రీకృ ష్ణుడు సుదర్శన చక్రాన్ని బాణునిపై ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం బాణాసురుని తొమ్మిదివందల తొంభై ఆరు చేతులను ( నాల్గింటిని వదలి) ఖండించింది.
దాంతో వెంటనే పరమశివుడు శ్రీకృష్ణుని సమీపిం చి స్తుతిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తాను బాణుని చంప ననీ, కారణం అతడు ప్రహ్లాదుడి మనుమడు అనీ, ప్రహ్లా దుని వంశంలోని వారిని చంపనని మాట ఇచ్చాననీ, ఆ కారణంచేత అతని గర్వం అణచటానికి నాలుగు చేతులు తప్ప మిగిలిన చేతులను ఖండించానని చెబుతాడు. బాణుడు శివుని భక్తులలో మొదటివాడని పేరు పొంది ముసలితనం మరణం లేకుండా జీవిస్తాడని అనుగ్ర హించాడు. శ్రీకృష్ణుడిచ్చిన వరంతో ఆనందించి పాదా భివందన చేశాడు బాణుడు. తన రాజధానికి వెళ్లి ఉష- అనిరుద్ధుల వివాహం చేశాడు బాణాసురుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement