Sunday, May 19, 2024

ఆత్మ సందర్శన యోగం

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడుకు ఉపదేశిస్తూ ”ఎప్పుడైతే మానవుడు మనస్సులో ఉన్న అన్ని కోరికలను వదిలి త్యాగం చేస్తాడో, అపుడు అతను ఆత్మ సంతుష్టుడై స్థిరబుద్ధి గలవాడవుతాడు. మోహాన్ని వీడి, ఇంద్రియ నిగ్రహంతో ఉంటాడో, వానికి ఆత్మయొక్క తత్త్వం దివ్యదర్శనమవుతుంది. అటువంటి ఆత్మారాముడే, స్థితప్రజ్ఞుడు.” అని వివరించారు.
స్థితప్రజ్ఞత ద్వారా ఆత్మ సందర్శన యోగం కలుగుతుందని చెపుతున్నారు. ఆత్మ సంద ర్శన యోగం అంటే మనం చేసే కర్మలు (పనులు) సత్కర్మలా? దుష్కర్మలా? అనే వివేచన, ధర్మంగా జీవిస్తున్నామా? మనలోని అహంకారాన్ని వదిలేసామా? వంటి విచక్షణ మనసు కు తెలుస్తుంది. అదే ఆత్మ సందర్శన యోగం. మహాభారతంలో స్థితప్రజ్ఞులు చాలామంది ఉన్నా, వారిలో చెప్పుకో తగ్గవారు ”ధర్మవ్యాధుడు, తులాధరుడు.” మనం వారి స్థితప్రజ్ఞత గురించి తెలుసుకుందాం.

అహింసా వ్రతుడు ధర్మవ్యాధుడు

ధర్మవ్యాధుడు ఎల్లవేళలా సత్యం పలికేవాడు. అహంసావ్రతుడు. కామరహతుడు. పుణ్యాత్ముడైనవాడు. మాతాపితభక్తి కలవాడు. ఇతడు పూర్వజన్మలో వేదవేదాంగ పండి తుడు. ఒక మహర్షి శాపం వలన ఈ జన్మలో బోయవాడుగా పూర్వజ్జానంతోనే జన్మించి, ధర్మవేత్తగా ఉంటూ తల్లితండ్రులను సేవిస్తూ ఉంటూ కులవృత్తి ధర్మబద్ధంగా (మాంసం విక్రయం) నిర్వర్తిస్తూ జీవిస్తున్నాడు. ఒక మహాపతివ్రత పంపగా, కౌశికుడు అనే బ్రాహ్మణుడు ధర్మవ్యాధుని వద్ధకు వచ్చి చూసి ”మాంసపు కొట్టు నిర్వహణలో ఉన్న ఇతను నాకు ఇంద్రియజ్జానం ఎలా కలిగిస్తాడు? ధర్మమార్గాలు ఎలా ఉపదేశిస్తాడు? అని మనస్సులో భావించి, ఆలోచిస్తుంటే, ధర్మవ్యాధుడే ”ఆ మహా ప్రతివ్రత పంపిన విప్రులు మీరేనా?” అని అడిగి ఆహ్వానించాడు. కౌశికుడు ఉండబట్టలేక ”ధర్మవ్యాధుడా! నువ్వు ధర్మం తెలిసినవాడవు. ఈవిధంగా జీవహంస చేయడం ధర్మమేనా?” అని అడిగాడు.
ధర్మవ్యాధుడు బదులిస్తూ ”బ్రాహ్మణులకు తపస్సు, స్వాధ్యాయనం, సత్యం, శౌచం, బ్రహ్మచర్యం, ప్రేమ, ధర్మాలు. క్షత్రియులకు ప్రజాసంక్షేమం, సుపరిపాలన, దండన ధర్మ మైతే, వైశ్యులకు వాణిజ్యం, పశుపాలన, శూద్రులకు వ్యవసాయం, శుశ్రూష, ధర్మాలు. మా కులవృత్తి మాంసం విక్రయం చేయడం. వంశపారంపర్యంగా వచ్చే ఆచారం దాటరానిది. కాబట్టి నా వృత్తి ధర్మాన్ని నేను పరిత్యజించలేను. నేను మీరనుకొన్నట్లుగా జీవహంస చేయ ను. మాంసాన్ని దళారులు ద్వారా కొని దాన్ని విక్రయిస్తాను. ఇదే నా బ్రతుకు తెరువు. వృత్తి ధర్మంతోపాటు అసూయకు లోను కాకుండా, రాగద్వేషాలు లేకుండా ఉంటూ విప్రులను, దేవతలను ఆరాధిస్తాను. పరదూషణచేయను. నేను తక్కువ కులంలో పుట్టినా, నేను పవిత్రు డునే.” అని వివరించాడు. కౌశికునికి ధర్మసూక్ష్మాలు శిష్టాచారాలు, జీవుడు ఎటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహం ఎలా సాధించాలో తెలిపాడు. అపుడు కౌశికుడు ”మనం చేసే కర్మలకు మూలమైన సత్త్వ-రజో-స్తమో గుణాల స్వభావం గురించి, వివ రించమని కోరగా, ”తమోగుణం మో#హమయం. సత్త్వ గుణం నిత్యం ప్రకాశవంతం. ఈ రెండు గుణాలు మిశ్ర మమే రజోగుణం. అంటూ త్రిగుణాల స్వభావం వివరించాడు. బ్రహ్మ జ్ఞాని శుభాశుభ కర్మ లలో నిమగ్నుడు కాడు. సుఖదు:ఖాలు కలిగే విషయంలో సమబుద్ధి కలిగి ఉంటాడు సు మా! జీవితం అస్థిరమని తెలుసుకొని, ఎవరికీ కీడు తలపెట్టకుండా, అందరితో మంచిస్వభా వంతో కలసిమెలసి తిరుగుతూ, దయార్ద్ర హృదయుడై, ప్రతిఫలం ఆశించకుండా నిత్య తప స్విగా, నిత్య తృప్తుడుగా ఉండేవాడే జ్జాని. అతనే బ్రహ్మ స్థితి నుంచి పొందుతారు. కౌశికుడు ధర్మాత్ముడు చేస్తున్న సత్కార్యాలు, అనుసరిస్తున్న ధర్మ మార్గాలు వల్లనే ఆత్మ సందర్శనం కలిగిందని ధర్మవ్యాధుడుకు తెలియచేశాడు.

తులాధరుడు

జాజలి అనే మహాముని కదలిక లేకుండా తపస్సు చేసుకొంటున్న సందర్భంలో పిచ్చుకలు అతని తలపై గూడు నిర్మించుకొని గ్రుడ్లు పెట్టాయి. పొదిగి పిల్లలయ్యాయి. ఈ విషయాన్ని గ్రహంచిన ముని దయతో పక్షులను తరమకుండా, తన ధర్మనిష్ఠకు తనలో తానే పొంగిపోతూ ఆనందిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆకాశం నుండి ”మహామునీ! కాశీ లో వ్యాపారి, మహాధర్మాత్ముడు తులాధరుడు గురించి నువ్వు విని ఉండవు. నిన్ను నువ్వే గొప్ప ధర్మ నిష్ఠతో ఉన్నట్లుగా భావిస్తున్నావు.” అని వినిపించింది. ఆ మాటలు విన్న
జాజలి మహర్షి ఆశ్చర్యపోయి, కాశీ వెళ్ళి అతనిని కలిసాడు. అపుడు తులాధరుడు జాజలి మహర్షిని ఆహ్వానించి సత్కార్యాలు చేసి ”మహర్షీ! పిచ్చుకలు నీ తలమీద
గూడు కట్టుకొని పిల్లలతో సహా జీవిస్తూండగా, తాము మాత్రం ఏ మనోవికారాలు లేకుండా ఎలా? తపస్సు చేయగలుగుతున్నారు? మీ ధర్మబుద్ధి, ప్రవర్తన ప్రశంసనీయం.” అన్నాడు. అది విని జాజలి ముని ”నీవు వ్యాపార వృత్తిలో ఉన్నావు కదా! నీకు ఏవిధంగా జ్ఞానం కలిగింది.” అని అడిగాడు. దానికి తులాధరుడు బదులిస్తూ ”మహాత్మా! నేను ఈ వ్యాపార వృత్తిలో క్రయవిక్రయాలు చేసేటప్పుడు మోసానికి దగాకు తావుండదు. తగిన లాభాన్నే వేసుకొంటాను. లాభన్ఖష్టాల పట్ల సమభావం కలిగి ఉంటాను. నా మనసు మట్టి పెళ్ళను- బంగారాన్ని సమంగానే చూస్తుంది.
స్తుతి, నిందలు, హంసించడం, నన్ను నేను పొగుడుకోవడం అనేవి చేయను. నేను పాటించే సత్యమనే యాగానికి అభయమే ఫలంగా ఉంటుంది. మితిమీరిన సౌఖ్యాలు- కీర్తి- సంపద కోరను. రాగద్వేషాలకు దూరంగా ఉంటాను. నేను మీకు చెప్పినదంతా సత్యమే సుమా!” అని వివరించాడు. అపుడు ఆ మహర్షి ”ఇప్పుడు నువ్వు చెప్పిన కర్మలలో తపస్సు. యజ్ఞాలు, దానాలు వంటి ధర్మకార్యాలు, వంటివి తెలపలేదు వేదాలలో, శాస్త్రాలలో, నిష్ణా తులైన పెద్దలు, ఈ కార్యాలన్నీ సత్కర్మలు అని చెపుతారు కదా!” ఆ వ్యాపారి ”అహం కారం, కోరిక, వీటితో కూడిన తపస్సు ఫలం, ఆపేక్షతో చేసే యజ్ఞం ప్రయోజనకారికావు. మునీంద్రా! ఎప్పుడూ సత్యమే యజ్ఞమని భావించి, సత్యాన్ని పాటిస్తూ, పొందే తృప్తి ఎంతో ఘనమైంది. దేవతలు కూడా సంతృప్తి వ్యక్తంచేస్తారు. దేవతా తృప్తి వలన తిరుగులేని ఆనం దం కలుగుతుంది. కర్మల ద్వారా కర్తవ్యాన్ని నిర్వహంచే విధం తెలిపాడు. మహాత్మా! పిచ్చు కలను మీరు తండ్రి వలే పెంచారు. మీ తలమీద ఎగురుతూ ఉన్నాయి. వాటిని పిలిచి, మీ చేతిపై ఉంచుకొని బుజ్జగించండి.” అనగానే మహర్షి ఆ పక్షులను పిలవగా, చేతిమీద వాల కుండా, ఆకాశంలో ఎగురుతూ”ముని వర్యా! మేము నిన్ను పరీక్షించడానికి ధర్మదేవత పంపగా వచ్చాము. ఆయన సేవకులం. ఎవరి హృదయంలో ఈర్ష్య, జుగుప్స, అసత్య వచ నం, హంసించడం వంటి దుర్గుణాలు ఉంటాయో? అతనికి హంసా భావం కలిగి ఉంటాడు. ముని వృత్తిలో ఉన్న నీలాంటి వారు అహం, మాత్సర్యం తొలగించుకోవాలి. చిత్తశుద్ధే శ్రద్ధ కు స్వరూపం. అందు వలన తత్త్వజ్ఞుడు శ్రద్ధను అనుసరిస్తాడు. శుభాలు కలుగుతాయి.” అని పలికి ఎగిరిపోయా యి. జాజలి మహర్షి తనలో ఉన్న అహంను గుర్తించి, తులాధరుడు వద్ద శలవు తీసుకుని తన ఆశ్రమానికి బయలుదేరారు.
– అనంతాత్మకుల రంగారావు 7989462679

Advertisement

తాజా వార్తలు

Advertisement