Thursday, April 25, 2024

అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

రాగం : సింధు భైరవి

ప|| కలిగెనిదె నాకు కైవల్యము
తొలుతనెవ్వరికి దొరకనిది || కలిగెనిదె నాకు ||

చ|| జయపురుషోత్తమ జయ పీతాంబర
జయ జయ కరుణా జలనిధి
దయ ఎరంగనే ధర్మము నెరగనా
క్రియయిది నీ దివ్య కీర్తనమే || కలిగెనిదె నాకు ||

చ|| శరణము గోవింద శరణము కేశవ
శరణు శరణు శ్రీ జనార్థనా
పరమమెరంగను భక్తి యెరంగును
నిరతము నాగతి నీ దాస్యమే || కలిగెనిదె నాకు ||

చ|| నమో నారాయణ నమో లక్ష్మీపతి
నమ: పుండరీక నయనా
అమిత శ్రీ వేంకటాధిప యిదె నా
క్రమమెల్లను నీ కైంకర్యమే || కలిగెనిదె నాకు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement