Sunday, April 28, 2024

అన్నమయ్య కీర్తనలు : ధారుణీ పతికిని

రాగం : మధ్యమావతి

ధారుణీ పతికిని తలంబ్రాలో బ హు
దారా రతునకు తలంబ్రాలో || ||ధారుణీ పతికిని||

హేమ వర్ణునకు యిందిరాపతికి
దామోదరునకు తలంబ్రాలో
సామజ భయ రక్షకునకు తులసీ
ధామునకు హరికి తలంబ్రాలో || ||ధారుణీ పతికిని||

కలికి రుకిమిణికి కడు దమకించి
తలదైవనకు తలంబ్రాలో
మలసి సత్యభామకు పతి పంకజ
దలనేత్రునకును తలంబ్రాలో || ||ధారుణీ పతికిని||

తిరు వేంకటపతి దినపెండ్లిగల
తరుణుల పతికి తలంబ్రాలో
యురవుగ బాయక యిందిర నురమున
ధరియించువారికి తలంబ్రాలో || ||ధారుణీ పతికిని||

Advertisement

తాజా వార్తలు

Advertisement