Tuesday, April 30, 2024

అన్నమయ్య కీర్తనలు : అజ్ఞానులకివి

రాగం : దేస్‌
అజ్ఞానులకివి యరుహము లింతే
సుజ్ఞానులకివి చొర నేలయ్యా! ||అజ్ఞానులకివి||

దైవము నమ్మిన దాసులకు
కావింపగ మరి కర్మము లేదు
దావతి జలనిధి దాటిన వారికి
వోవల మరియును వోడేఅయ్య! ||అజ్ఞానులకివి||

గురుకృప గలిగిన గుణనిధికి
అరయబాప పుణ్యము మరిలేదు
విరసపుజీకటి వెడలిన వారికి
పరగ మరియు దీపం బేలయ్య! ||అజ్ఞానులకివి||

జగము లెరుగు వైష్ణవులకును
తగిలెటి యపరాధంబులు లేవు
అగపడి శ్రీ వేంకటాధిపుగొలిచితే
యెగును దిగువ మా కెదురేదయ్య! ||అజ్ఞానులకివి||

Advertisement

తాజా వార్తలు

Advertisement