Tuesday, October 8, 2024

అన్నమయ్య కీర్తనలు : తానే కాకెవ్వరు

రాగం : సామంతం
తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తన –
లోన బెట్టుకొని మాకు లోనైనవాడు || ||తానే కాకెవ్వరు||

చదివించి కూడువెట్టి జారకుండ నిల్లుగట్టి
బెదురులేని బుద్ది పిన్న నాడె చెప్పి
యెదిరి నడిగి ద్రవ్యమిది గొమ్మనుచునిచ్చి
పదిలమై తమ్ము బాలించువాడు || ||తానే కాకెవ్వరు||

మోహవియోగమ్ము మోహానురాగమ్ము
దేహ విభాతగంబు దెలిపిన కలికి
ఐహికమున వేంకటాధీశుడై సర్వ
దేహ రక్షకుడై తిరుగుచున్నాడు || ||తానే కాకెవ్వరు||

Advertisement

తాజా వార్తలు

Advertisement