రాగం : నీలాంబరి
తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద –
వెలుగులోపలకి వెలుగేల || ||తెలియ చీకటికి||
అరయ నాపన్నునికి అఢయమ్మీవలెగాక
ఇరవైన సుఖిని కావనేల
వరతపోయెడివాని వడితీయవలెగాక
దరివాని తివియంగ తానేల || ||తెలియ చీకటికి||
ఘనకర్మారంభుని కట్లు విడవలెగాక
ఎనసిన ముక్తుని గావనేల
ఆనయము దుర్బలునికి అన్నమిడవలెగాక
తనిసిన వానికి తానేల || ||తెలియ చీకటికి||
మితిలేని పాపకర్మికి తా వలెగాక
హితవెఱుగుపుణ్యునికి (తా) నేల
ధృతిహీను కృపచూచి తిరువేంకటేశ్వరుడు
తతి కావకుండిన తానేల || ||తెలియ చీకటికి||