Saturday, June 22, 2024

అన్నమయ్య కీర్తనలు : నీవె మాకు దిక్కు

రాగం : వలజి

నీవె మాకు దిక్కు
నీవె మాకు దిక్కు నినే తలతుము
కావు మా నేర మెంచక కరుణానిధి|| ||నీవె మాకు దిక్కు||

నెట్టన సూర్యునిలోని నెలకొన్న తేజ మూ
గట్టిగా చంద్రునిలోని కాంతి పుంజమూ
పుట్టి రక్షించే యజ్ఞ పురుషుని ప్రకాశమా
వొట్టుగా దేవతలలో వుండిన శక్తి || ||నీవె మాకు దిక్కు||

సిరులు మించిన యట్టి జీవులలో ప్రాణమా
గరిమ వేదములలో గల యర్ధమా
పరమ పదమునందు పాదుకొన్న బ్రహ్మమా
చరాచరములలో సర్వాధారమా|| ||నీవె మాకు దిక్కు||

- Advertisement -

జగములో వెలిగేటి సంసార సుఖమా
నిగిడిన మంత్రముల నిజ మహిమా
మిగుల శ్రీ వేంకటాద్రి మీది నున్న దైవమా
ముగురు వేల్పులలోని మూలకందమా|| ||నీవె మాకు దిక్కు||

Advertisement

తాజా వార్తలు

Advertisement