Thursday, April 25, 2024

ఎపి కాంగ్రెస్ కి అర్ధిక క‌ష్టాలు … ఆస్తి ప‌న్ను బ‌కాయిలే కోటికి పైగా..

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీని ఆర్ధిక కష్టాలు వెంటాడుతున్నాయి. పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను చెల్లించలేని స్థితిలో కొట్టు మిట్టాడుతోంది. ఇది పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారమేనంటూ రాష్ట్ర నాయకత్వం సర్ది చెప్పుకుం టున్నా.. ప్రభుత్వం నుంచి ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు రావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని పలు నగరాల్లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాల యాలకు సంబంధించి ఆస్తి పన్నుల బకాయిలు చెల్లించేందుకు నిధులు సమీకరణ వైపు చూస్తోంది. ఉన్న పరిస్ధితిని వి వరిస్తూ రాష్ట్ర అధ్యక్షులు అధిష్టానానికి లేఖ కూడా రాశారు.అయినా ఫలితం లేకపోయింది. రాష్ట్రంలోని తొమ్మిది కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయా లకు రూ. 1.40 కోట్లకు పైగా బకా యిలు చెల్లాంచాల్సి ఉంది. తాజాగా వీటిపై దృష్టి సారించిన జగన్‌ సర్కార్‌ వెంటనే పన్ను బకా యిలు చెల్లించాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి నోటీసు లు జారీ చేసింది. విశాఖ పట్నం రూ. 30 లక్షలు, కాకినాడ రూ. 42,71,277 లక్షలు, ఏలూరు రూ. 6,29,926 లక్షలు, విజయవాడ రూ. 41,73,917 లక్షలు, గుంటూరు రూ. 3,92,282 లక్షలు, ఒంగోలు రూ. 5,31,783 లక్షలు, నెల్లూరు రూ.1,51,867 లక్షలు, కడప రూ. 6 లక్షలు, కర్నూలు రూ. 2,94,890 లక్షలు ఇలా మొత్తం రూ.1.40 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి.

అధిష్టానానికి లేఖ..
రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఆర్ధిక పరిస్ధితి ఆందోళన కలిగిస్తున్న నేపధ్యంలో పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను బకాయిల చెల్లింపు కోరుతూ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హైకమాండ్‌కు లేఖ రాశారు. ఆయా కార్యాలయాలు చెల్లించాల్సిన పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను వివరాలను ఏఐసీసీ -టె-జరర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకమాండ్‌ స్థానికంగానే నిధులు సమీకరించుకుని బకాయిలు చెల్లించుకోవాలని సూచించి నట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమా చారం. దీంతో రాష్ట్ర నాయకత్వం విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టాలనే భావనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అభిప్రాయంతోనే ఉన్న పీసీసీ పార్టీలోని సీనియర్‌ నాయకులు, అభిమానులను విరాళాలు కోరుతూ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు లేఖలు రాసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విరాళాలు అందించేందుకు బ్యాంకు ఖాతా వివరాలను కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.

అంతా భగవంతుడిపైనే భారం..
రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న పార్టీని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రస్తుతం సాగుతున్నాయి. పీసీసీ అధ్యక్షునిగా గిడుగు రుద్రరాజు బాధ్యతలు చేపట్టిన నెలల వ్యవధిలోనే ప్రజల్లోకి వెళ్ళే దిశగా అనేక కార్యక్రమాలు నిర్వహి స్తున్నారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని నడిపించడం కత్తిమీద సామే. ఈ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల బకాయిలు చెల్లించాలని నోటీసులు రావడం కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అయినా చలి ్లంచక తప్పదంటున్న రుద్రరాజు అంతా భగవంతునిపై భారం వేశానంటున్నారు. ఈ వ్యవహారం పార్టీ అంతరంగికమేనని ఆంధ్రప్రభతో చెప్పారు. చాలాకాలం గా పెండింగ్‌లో ఉన్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement