Friday, May 3, 2024

అనంతం… అద్భుతం… దుర్వాంకురం

ఏ శుభకార్యమైనా నిర్విఘ్నంగా జరగా లన్నా, దేవతా వ్రతాలు, నిత్యాను ష్టా న కార్యక్రమం పూర్తి అవ్వాలన్నా, తొలి పూజ గణపతికే. విఘ్ననివారకుడు, విజయకార కుడు, ఓంకార స్వరూపుడు. వినాయకచవితి మరికొద్ది రోజుల్లో నిర్వహంచుకోబోతున్నాము. ఆ రోజు అనేక రకాల పత్రి, పూలు పూజలో వాడి నా, దుర్వాంకురం ఖచ్చితంగా వాడతాం. ప్రత్యే కంగా కొన్ని నామాలు ఈ దుర్వాంకురాలుతో పూజ కూడా చేస్తాం. ఈ దుర్వాంకురం అంటే ‘గరిక’. ఇది ర#హద రులు ప్రక్కన మొలకెతు ్తతూంటుంది. గణపతికి గరిక అంటే ప్రీతి.దాని మ#హమ గురించి తెలుసు కుందాం.
మిథిలానగరంలో విరోచనుడు, సులోచన దంపతులు ఉండేవారు. వీరు గణషుని భక్తులు. ఒకసారి గణశుడు వీరి భక్తికి మెచ్చి, వారింటికి ఒక వృద్ధి బ్రా#హ్మణుడు రూపంలో వెళ్ళాడు. వారు చాలా బీదవారు. కూర్చోడానికి కుర్చీ కాని, మరే ఆసనమైనా లేని వాళ్ళు. ఇంట్లో ఒక మూల గణపతి ప్రతిమను ఉంచి పూజిస్తున్నారు. ఆ పరి స్థితిలో వృద్ధ బ్రా#హ్మణుడు రూపంలో వచ్చిన గణపతి” ఓ! పుణ్య దంపతులారా! నేనొక బీద బ్రా#హ్మణుడను. నాకు ఆకలిగా ఉంది. ఆహారం కోసం తిరుగుతూ మీ ఇంటికొచ్చాను. నాకు కడు పునిండా ఆహారాన్ని పెట్టమనగానే, ఆ దంపతు లు ఆశ్చర్యంతో, బేలగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటే, గణపతి తొందర పెడితే ”స్వామి! మేము చాలా కడు బీదవారం. మేము ఎవ్వరినీ యాచించక, యాదృచ్ఛికంగా వచ్చిన దానితోనే జీవిస్తున్నాం. ఈ రోజు పూజ పూర్తి అయిన తరువాత మిగిలిన రెండు గరికలు మా త్రమే ఉన్నాయి. ”అనగానే అవే పెట్టమని వృద్ధ బ్రా#హ్మణుడు అనగానే, వారు ఆ గరికలను (దు ర్వాంకురాలు) ఒక ప్లేటులో పెట్టి ఆయన ముం దుంచారు. ఆ విప్రుడు ఆ గరికలను తీసుకుని, మాయా రూపం వదిలేసి, నిజ దర్శనం చేసాడు. అపుడా దంపతులు స్తుతించారు. గణపతి మా ట్లాడుతూ” మీ భక్తికి మెచ్చాను. మీకున్నా లేక పోయినా, తిన్నా, తినకపోయినా నా పూజ మాత్రం మానలేదు. మీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అపుడా దంపతులు ”స్వామి! మాకు ఈ ఘోర సంసార బాధల నుండి ముక్తిని ప్రసాదించమని కోరగా, ఇకనుండి మీకు ఆర్థిక కష్టాలు ఉండవు. నిశ్చింతగా కొంత కాలమైన తదుపరి, ముక్తి కలుగుతుంది అని చెప్పి అంతర్థా నం అయ్యారు గణపతి. తరువాత చూస్తే, వీరు పూజ చేసిన దుర్వాంకురాలన్నీ బంగారం అవ్వ డంతో వారి సంతోషానికి అవధులు లేవు.
ఒకసారి కౌండిన్య మ#హర్షిని ఆయన భార్య ఆశ్ర యాదేవి ”నాథా! మనం గణపతి పూజ లో గరిక (దుర్వాంకురాలు) వాడతాము. దాని మ#హమ గురించి తెలపండి” అని కోరగా ”ఆశ్రయా! ను వ్వు ఒక గరికను తీసుకుని సరాసరి స్వర్గానికి వెళ్ళి గరిక ఎత్తు బంగారం ఇవ్వమన్నానని అర్థించు.” అనగానే, ఆమె సరాసరి ఇంద్రుడు వద్దకు వెళ్ళి భర్త చెప్పిన విషయము చెప్పి, తాను తెచ్చిన గరి కను ఆయన ముందుంచింది.
ఇంద్రుడు ”అమ్మా! కౌండిన్య మహర్షి కోరిన ట్లుగానే గరిక ఎత్తు బంగారం ఇస్తానని చెప్పి, దూతను రమ్మనమనగా ఆ దూతను ఇచ్చి, కౌం డిన్య మహర్షి భార్య ఆశ్రయాదేవిని కుబేరుడు వద్ధకు పంపి తాను ఇమ్మనట్లుగా బంగారం ఇప్పించు అని పంపాడు. కుబేరుడు బాగా ఆలో చించి ”మహర్షి గరిక ఎత్తు బంగారం కోరడమే మిటి? అని ఆలోచిస్తూనే త్రాసులో ఒక ప్రక్క దుర్వాంకురాన్ని, మరోప్రక్క బంగారాన్ని ఉం చాడు. గరికే బరువుగా ఉంది. కుబేరుడు క్రమ క్రమంగా తన సంపదనంతా త్రాసులో పెట్టినా, సరితూగలేదు. కుబేరుడు ఇంద్రుడుకు విషయా న్ని తెలిపాడు. ఇంద్రుడు కూడా ఆశ్చర్యపోయి, తన సంపదంతా పెట్టినా, గరికతో సరితూగ లేదు. వారికి ఏమిచేయాలో అర్థంకాక, కౌండిన్య మహర్షి భార్య ఆశ్రయాదేవిని తీసుకుని కుబేరు డు, ఇంద్రుడు మహర్షి ఆశ్రమానికి వచ్చా రు.”మహర్షీ! మీరు పంపిన ఈ దుర్వాంకు రం సామాన్యమైంది కాదు. దీనిలోని విశిష్టత తెలుప మని కోరగా ”ఇది గణపతిని పూజించిన దు ర్వాంకురం. అనంతమైంది. అద్భుతమైనది. గణషునకు ప్రీతిపాత్రమైనది. అందుకే లోకానికి ఈ గరిక మహాత్యం తెలియడానికి ఇలా చేసా ను.” అని చెప్పాడు.
ఈ దుర్వాంకురం మ#హమ విన్నా, చదివినా, అనంతమైన పుణ్యం సిద్ధిస్తుంది అని గణష్‌ పురాణం వివరిస్తోంది. కాబట్టి, వినాయకచవితి రోజున ఈ గరికతో పూజ తప్పనిసరిగా చేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement