Thursday, April 25, 2024

ఆధ్యాత్మిక ప్రయాణం

”ప్రతి ఒక్కరు తనలోకి తాను చూడగలగాలి. అంతర్మథనం సాగాలి. అదే నిజమైన సత్యా న్వేషణ, ఆధ్యాత్మిక ప్రయాణం, వేదాంతజ్ఞా నం, ఈ మాటలు ఎందరో మహర్షులు, సద్గురువులు చెప్పారు. గ్రంథాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు పేర్కొ న్నాయి. కనిపించేది అంతా కనుమరుగు అవుతుంది. శాశ్వతమైన సత్యమార్గాన్ని తెలుసుకో… అదే భగవం తుడి తత్వం. శరీరం తాత్కాలికం, కనిపించని ఆత్మ శాశ్వతం. కనిపించని పరమాత్మ దానికి ఆధారం. క్లిష్ట మైన సంస్కృత శ్లోకాలతో వేద ప్రామాణికాలతో సాగే ప్రబోధాలవల్ల సామాన్య మానవుడు నేనెవరు అనేది గుర్తించడంలేదు. తననుతాను విచక్షణతో తెలుసుకో లేక సందేహంలో ఊగిసలాడుతున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానం వైపు దృష్టి సారించడంలేదు. అది తనకు అర్ధం కాని భాష అని, మతిని చాంచల్యం గావించే విద్యగా భావిస్తున్నాడు. సులభంగా, సరళమైన పదాలతో, ఉదాహరణలతో సాగే కథలు, పురాణాలు, ఇతిహాసా లు ఆకర్షించినట్లుగా వేదాలు, ఉపనిషత్తులు, తత్వశా స్త్రాలు సామాన్యుల్లో ప్రాచుర్యం పొందడం లేదు. దేవున్ని మీరు చూశారా’ అని వివేకానందుడు. శ్రీ రామ కృష్ణుణ్ని ప్రశ్నించినప్పుడు ‘అవును, చూశాను. నీవు నన్ను ఎలా చూశావో అలాగే నేను దేవుణ్ని చూశాను’ అని సమాధానం ఇచ్చారు. దేవుడి గురించి. వారి తత్వం గురించి, వేదప్రమాణాలను వల్లె వేయలేదు. నిర్వచనం చెప్పలేదు. ప్రవచనం సాగలేదు. సూటిగా తాను దేవుణ్ని దర్శించానని చెప్పారు. ఆ సందేశమే అన్ని ఉపనిషత్తుల సారం. ‘ఈశ్వర సర్వ భూతానాం కనిపించేదంతా దైవస్వరూపమే. కానిది. సృష్టిలో మరొకటి లేదు. సరళమైన.. సులభమైన గురుబోధ నరేంద్రుణ్ని వివేకానందుడిగా తీర్చిదిద్దింది
నేనెవరు అని ప్రశ్నించుకుని, నీలోకి నువ్వు చూ డు అనే సందేశంలో దాగి ఉన్న అంతరార్ధం మానవ త్వ మార్గం. గ్రహాలపైకి ప్రయాణించే మనిషి, అగాధ మైన సముద్రం లోతుకు వెళ్ళే మనిషి, కొన్ని అంగుళా ల లోపల ఉన్న అంతరంగంలోకి వెళ్ళలేకపోతున్నా డు. తాను, తన సంపద, అధికారం, పరివారం శాశ్వ తమని మనిషి భావిస్తాడు. అవే ఆకృత్యాలకు, స్వార్ధా నికి, సంకుచిత మనస్తత్వానికి కారణాలు. స్వార్ధం తగ్గిస్తే శ్రేయస్సు కోరికను అదుపుచేస్తే శాంతి. మోహ క్షయం మోక్షం. నేనెవరు అని ప్రశ్నించుకొనే కనీస జ్ఞానం ఇవ్వగలిగితే చాలు- మనిషి తనలోనే మనసు అనే క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని పొందుతా డు. అంతర్యామి బాహ్యంలో లేదు. పది అంగు ళాల పరిమాణంలో నీలోని నువ్వుగా ఉన్నాడని నారా యణ సూక్తం చెబుతోంది. ప్రతి ప్రాణీ నారాయణ స్వరూపమే. ఎవరికి సేవ చేసిన నారాయణుడికే చెంది నట్లు. ఎవరిని బాధించిన నారాయణుణ్న బాధించి నట్లు, ఇదే బ్రహ్మూపదేశం పట్టాభిషేకమైనా, వనవా సమైనా స్థిరచిత్తంతో సాగిన శ్రీరాముడు దేవుడిగా మారాడు. శోకం వదిలి, ఫలితాన్ని ఆశించ కుండా నీ కర్తవ్యాన్ని నిష్కామంగా నిర్వర్తించు అని బోధించిన కృష్ణుడు దేవుడిగా పూజలందుకొన్నాడు. అ#హంస పరమధర్మం, శాంతి, సౌఖ్యాలు సమాజ సేవలోనే దొరుకుతాయి. హృదయాన్ని వీణగా భావించి కరుణ, విషాదం, ఆనందం, దు:ఖం, అవమానం, సత్కారం తీగలుగా రాగాలు పలికిస్తే- అదే ఆనందమయ జీవి తానికి ఆధ్యాత్మిక ప్రయాణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement