Monday, April 29, 2024

అధిక మాసం అంటే…

నేటి నుంచి అధిక శ్రావణమాసం

నిన్నటితో ఆషాఢమాసం ముగిసింది. నేటి నుంచి లక్ష్మీ ప్రదమైన శ్రావణమాసం ప్రారంభమవుతుంది. కానీ ఈ శోభ కృత్‌ నామ సంవత్సరంలో శ్రావణ మాసాలు రెండు రాబోతు న్నాయి. మొదటిది అధిక శ్రావణమాసం. రెండవది నిజ శ్రావ ణమాసం. ఈ రోజు అంటే జూలై 18 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు అధిక శ్రావణ మాసం.
జ్యోతిష శాస్త్ర ప్రకారం కాలగణన సూర్య, చంద్రుల ఆధా రంగా జరుగుతుంది. సూర్యుణ్ణి ఆధారంగా తీసుకొని లెక్కకట్టే కాలమానాన్ని ‘సౌరమానం’ అనీ, చంద్రుణ్ణి ఆధారంగా తీసు కొనే సంవత్సర గణనాన్ని ‘చాంద్రమానం’ అనీ అంటారు.
చాంద్రమానంలో నెల అంటే 29.53 రోజులు. దీని ప్రకారం చాంద్రమానంలో ఏడాదికి 354 రోజులు. సౌరమా నంలో ఏడాదికి 365 రోజులు, 6 గంటలు వుంటాయి. అంటే సౌరమానానికీ, చాంద్రమానానికీ మధ్య ఏడాదిలో 11 రోజుల తేడా ఏర్పడుతోంది.
ఈ వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి 3 సంవత్సరాలకు చంద్ర క్యాలెండర్‌కు ఒక మాసాన్ని అధికంగా జోడిస్తారు. దాని నే ‘అధికమాసం’ అంటారు.
కాల గణనలో ప్రతి మాసానికి ఒక అధిష్టాన దేవత ఉం టుంది. ఆయా మాసాల్లో వారిని పూజిస్తారు. కానీ అధిక మాస విషయానికి వస్తే ఏ దేవత కూడా అందుకు సిద్ధపడలేదు. అప్పుడు శ్రీమహావిష్ణువు అధికాసులకు అధిష్టానం కావడానికి సిద్ధమయ్యాడు. శ్రీ మహా విష్ణువుకు పురుషోత్తముడు అనే పేరు కూడా ఉంది. అందుకే అధిక మాసాన్ని ‘పురుషోత్తమ మాసం’ అని అంటారు. ఈ మాసంలో చేపట్టే దైవకార్యాలకు అధికమైన ఫలాలు లభిస్తాయని పురుషోత్తముడు వరమిచ్చాడనీ పురాణా లు చెబుతున్నాయి.

అధికమాసంలో నిషిద్ధాలు
అధికమాసాలలో శుభకార్యాలను ఆచరించడం నిషిద్ధ మని శాస్త్రాలు తెలియజేశాయి. దీని ప్రకారం వివాహాలు, నామ కరణం, ఉపనయనాలు, గృ#హప్రవేశాలు, శంకుస్థాపనలు, పిల్లలకు చెవులు కుట్టడం, యాగం మొదలైన శుభకార్యాలను ఈ మాసంలో చేయకూడదు, పితృకార్యాలను కూడా అధిక మాసంలో కాకుండా నిజ మాసంలోనే జరపాలి. ఇల్లు, షాపు లు, వాహనాలు లాంటివి కూడా ఈ మాసంలో కొనకూడదని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement